Stock Markets: రక్ష బంధన్ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు దినమా..? ఏఏ రోజుల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటిస్తారు

 Stock Markets: స్టాక్ మార్కెట్లు సాధారణంగా పర్వదినాల్లో సెలవు ప్రకటిస్తుంటాయి. అయితే రక్షా బంధన్ సందర్భంగా సెలవు దినం పాటిస్తాయా..లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 18, 2024, 11:32 PM IST
 Stock Markets: రక్ష బంధన్ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు దినమా..? ఏఏ రోజుల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటిస్తారు

Share Market: స్టాక్ మార్కెట్లు ఆగస్టు 19 సోమవారం  రక్షాబంధన్ పర్వదినం రోజున  పనిచేస్తాయి. ఈ రోజున ఎలాంటి సెలవు లేదు. యధావిధి గానే ట్రేడింగ్ సాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ వీకెండ్ తర్వాత స్టాక్ మార్కెట్లు  ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అనంతరం మళ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే తారీఖునే స్టాక్ మార్కెట్లకు సెలవు కాబోతోంది. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లకు కేవలం నాలుగు రోజులు సెలవు మాత్రమే మిగిలి ఉంది. వీటిలో దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్ మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటిస్తారు.

అమెరికాలో ఆర్థిక  మాంద్యం భయాలు తగ్గిన కారణంగా గ్లోబల్ మార్కెట్లలో పెరుగదల నమోదు అయ్యింది. దీంతో ఐటీ  స్టాక్‌ల కొనుగోలు కారణంగా గత శుక్రవారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున లాభాలను నమోదు చేసింది. సెన్సెక్స్ 1,331 పాయింట్ల జంప్‌తో రెండు వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 397 పాయింట్లు పెరిగి 24,500 మార్క్‌కు ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 1,330 పెరిగి 80,436 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు గరిష్ట లాభాలతో ముగిశాయి.

Also Read :Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర..తులం బంగారం ఏకంగా 72 వేలు దాటేసింది..షాక్ లో పసిడి ప్రియులు

సోమవారం స్టాక్ మార్కెట్ కదలికలు, ప్రపంచ ట్రెండ్, విదేశీ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాల ద్వారా నిర్ణయించనున్నాయి. ఈ వారంలో విడుదల కానున్న US ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశ వివరాలపై కూడా ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే జపాన్‌లోని ద్రవ్యోల్బణం డేటా, US FOMC సమావేశం వివరాలు సైతం చాలా ముఖ్యమైనవి, దానిపై పెట్టుబడిదారులు దృష్టి వేసి ఉంచాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read :Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!  

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) మూలధన ప్రవాహాలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులపై కూడా వ్యాపారులు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో అటు ప్రపంచ మార్కెట్లు ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యుఎస్‌లో ద్రవ్యోల్బణం తగ్గడం, బలమైన రిటైల్ అమ్మకాల డేటా వంటి సానుకూల డేటా మాంద్యం భయాలను తగ్గించిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు సోమవారం పాజిటివ్ ట్రెండ్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News