Rain Alert To Telangana: వర్షాకాలంలో కొంత విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ తెలంగాణలో జోరందుకోనున్నాయి. రాగల మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: K Keshava Rao: కేకే, రేవంత్‌కు భారీ షాక్.. రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీకి ఛాన్స్!
కేరళ తీరం ఆగ్నేయ అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరించారు. ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో వానలు పడతాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read: Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలు
వర్షం కురిసే జిల్లాలు
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొడ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కృష్ణా ప్రాజెక్టులు కళకళ.. గోదావరి వెలవెల
తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. జూన్‌లో తక్కువ వర్షాపాతం నమోదవగా.. జూలైలో భారీగా కురిశాయి. ఈనెల ఆరంభంలో కొంత వర్షాలు తగ్గినా తర్వాత మళ్లీ ఇప్పుడు జోరందుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుని గేట్లు ఎత్తగా.. ఒక్క గోదావరి ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు బోసిపోయాయి. కాళేశ్వరం నుంచి నీళ్లు వృథాగా వదిలేస్తుండడంతో భద్రాచలం నుంచి పోలవరానికి భారీగా ప్రవాహం వెళ్తోంది. దీని కారణంగా గోదావరి జలాలు ప్రాజెక్టుల్లోకి కాకుండా సముద్రం పాలవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter