Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్‌ బ్యాంక్‌ గుడ్‌ న్యూస్‌.. 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

Indian Bank Recruitment 2024: బ్యాంకు ఉద్యోగం మీ కల..? అయితే, మీకు ఇండియన్‌ బ్యాంక్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

Indian Bank Recruitment 2024:  ఇండియన్‌ బ్యాంక్‌ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 2వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఇండియన్‌ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ indianbank.in లో కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్‌ లో భాగంగా మొత్తం 300 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి.  

2 /5

ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిపి-40 పోస్టులు, తమిళనాడు, పుదుచ్చేరి కలిపి-160, కర్నాటక- 35, మహారాష్ట్ర-40, గుజరాత్‌ -15 పోస్టులను భర్తీ చేయనుంది.    

3 /5

ఇండియన్‌ బ్యాంక్‌ రిక్రూట్మెంట్‌ 2024 అర్హత.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు మార్కులు, శాతం కూడా వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది.  ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2024 జూలై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ అందించే ఏజ్‌ రిల్యాక్సేషన్‌ కూడా వీరికి వర్తిస్తుంది.

4 /5

ఎంపిక విధానం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేదా ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూ పూర్తైన అభ్యర్థులకు ఇమెయిల్‌ లేదా బ్యాంక్‌ వెబ్‌సైట్‌లలో కాల్‌ లెట్టర్‌ అందుబాటులో ఉంచనున్నారు. ఈ నోటిఫకేషన్‌కు సంబంధించిన టెస్ట్‌ 200 మార్కులకు నిర్వహిస్తారు, ఇంటర్వ్యూకు మరో 100 మార్కులు కేటాయిస్తారు.

5 /5

దరఖాస్తు రుసుము.. ఇండియన్‌ బ్యాంక్‌ రిక్రూట్మెంట్‌ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈడీ అభ్యర్థులు మాత్రం రూ.175 నామమాత్రపు ఫీజు చెల్లించాలి.