Zodiac Sign wear Silver Ring: జాతకం ప్రకారం కొన్ని రాశులు కొన్ని లోహాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అందుకే రాశి చక్రం ప్రకారం లోహాలను ధరిస్తారు. కొందరు బంగారం ఉంగరం ధరిస్తే కలిసి వస్తుంది, మరికొందరికి డైమండ్ రింగ్ కలిసి వస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ఉంగరం ధరిస్తే ఊహించని లాభాలు కలిగి వస్తుందో తెలుసా?
రాశి చక్రం ప్రకారం, నిపుణుల సూచన మేరకు లోహాలను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక చక్రంలో గ్రహాల స్థానాలను అనుసరించి వారు మనకు ఏ లోహాన్ని ధరించాలో సూచిస్తారు. అలా కాదని ఇష్టం వచ్చిన లోహాలను ధరిస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి.
ఉంగరాలు చేతికి అందాన్ని పెంచడమే కాకుండా అవి అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి. కొంతమందికి బంగారం కలిసి రాదు. అటువంటి వారికి వెండి లోహాన్ని సూచిస్తారు. ఏ రాశివారు వెండి ఉంగరం ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని రాజభోగాలు అందుతాయో తెలుసుకుందాం.
మేషరాశి.. జాతకం ప్రకారం వెండి ఉంగరం ధరిస్తే మేష రాశివారికి కలిసి బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఇలా మేషరాశివారు వెండి ఉంగరాన్ని ధరిస్తే కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రమోషన్ల కూడా పొందుతారు.
కర్కాటక రాశి.. వెండి ఉంగరం ధరించడం వల్ల శుభయోగాలు కలిగే మరో రాశి కర్కాటకం. ఈ రాశికి కూడా వెండి బాగా కలిసి వస్తుంది. జీవితంలో దశ తిరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. భావోద్వేగాలు కూడా కర్కాటక రాశి వారికి నియంత్రణలో ఉంటాయి.
తుల రాశి.. వెండి తుల రాశివారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారు వెండి ధరించడం వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. వీరికి ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. ఈ రాశివారు వెండి ధరించిన వెంటనే శుభ ఫలితాలు పొందడం గమనిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)