Independence day 2024 flag rules: భారతదేశం ప్రస్తుతం 78 వ ఇండిపెండెన్స్ డే వేడుకల్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలిదానాలు చేసుకున్నారు. అనేక ఉద్యమాలు చేసి, వందల ఏళ్లలో జైళ్లలో మగ్గిపోయారు. కనీసం తమ కుటుంబానికి చివరి చూపుకు కూడా నోచుకోలేని వారు ఎందరో ఉన్నారు. అయితే.. వీరి ఆత్మబలిదానాలు,త్యాగాల వల్ల 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ వాళ్లు మనదేశం విడిచివెళ్లిపోయారు. అందుకు గుర్తుగా మనం ప్రతిఏడాది ఆగస్టు 15 రోజున ఇండిపెండెన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈరోజున దేశం కోసం ప్రాణా త్యాగాలు చేసినవారిని స్మరించుకుంటూ, భవిష్యత్తు తరలాకు వాళ్ల త్యాగాలను వివరించి చెప్తుంటాం.
ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 న రాజ్యంగం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జాతీయ జెండాలను ఎగుర వేస్తుంటాం.ఈరోజుల్లో దేశంలోని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కార్యాలయాలు.. ప్రతిచోట మువ్వన్నెల జెండాను ఎగురవేస్తుంటారు. ఆగస్టు 15 లేదా జనవరి 26 తేదీల్లో జెండా పండుగ జరుపునేప్పుడు యువత ఎక్కువగా కార్లు, బైక్ ల మీద ర్యాలీలుగా వెళ్తుంటారు. తమ వాహానాలకు జాతీయజెండాలను పెట్టుకుంటారు. కానీ ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం.. కొంతమంది మాత్రమే తమ వాహానాల మీదా జాతీయ జెండాలను పెట్టుకునేందుకు అర్హత ఉందని చెప్తుంటారు..
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా , 2002 ప్రకారం కార్లపై జాతీయ జెండాను ఎగురవేసే హక్కు దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, దేశ ప్రధాని, లెఫ్ట్ నెంట్ గవర్నర్, ఇండియన్ మిషన్ పోస్టులో చేసే అధిపతులు, ప్రధాన మంత్రి, కేబినెట్, కేంద్ర ఉపమంత్రులు, రాష్ట్ర మంత్రులు, క్యాబినెట్ మంత్రి, కేంద్రపాలిత ప్రాంతం సీఎం, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జెండా ఎగుర వేస్తుంటారు. వీరి వాహానాల మీద జాతీయ జెండా ఉంటుంది. అదే విధంగా.. జాతీయ జెండాను అవమాన పర్చేలా ప్రవర్తిస్తే.. ఎవరైనా ఈ నేరాలకు పాల్పపడితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటారు.
Read more: Mahesh Babu: కాలినడకన అలిపిరిలో మహేష్ బాబు ఫ్యామిలీ.. ఎంత సింపుల్ గా ఉన్నారో.. వీడియో వైరల్..
దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యంగం, జాతీయ గీతం వంటి భారతీయ జాతీయ చిహ్నాలను అవమానిస్తే.. సదరు వ్యక్తికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది. జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేసినా దానికి గౌరవం ఇవ్వాలి. సరైన స్థలంలో ఉంచాలి. నేలపై, మురికి ప్రదేశంలో ఉంచకూడదు.చిరిగిన జెండా ఎగురవేయకూడదు. జాతీయ జెండాలతో ముఖం తుడుచుకోవడం, జెండా ఎగురవేసేక్రమంలో తలకిందులుగా ఎవరైన ఎగురవేసి అగౌరవపర్చిన కూడా నేరంగా పరిగణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter