సాహో మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.. రీసెంట్ గా రిలీడ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలో సాహో టీంకు గట్టిషాక్ తగలింది. సాహో సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు మ్యూజిక్ డైరక్టర్స్ శంకర్-ఎహసాన్-లాయ్. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. సాహో నుంచి ఎందుకు తప్పుకున్నారనేది విషయంపై వారు క్లారిటీ ఇవ్వలేదు. చిత్ర యూనిట్ కూడా దీనిపై వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఈ అంశం సస్పెన్స్ మారింది.
ఈ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?
సాహో నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. సాహో మేకింగ్ వీడియోస్ కు ఇప్పటికే తమన్ సంగీతం అందిస్తున్నాడు. కుదిరితే అతడ్నే మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగిస్తాగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా భారీ ఎక్సెపెక్టేషన్స్ తో తెరపైకి వస్తున్న ఈ మూవీకి తాజా పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఫ్యాన్ ఆందోళన చెందుతున్నారు.
సాహో టీంకు షాక్ ; ప్రాజెక్టు నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఔట్ !!