Pawan Kalyan: సినిమాల్లో పవర్ స్టార్ గా ఎనలేని స్టార్ డమ్ తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం పొందారు పవన్ కళ్యాణ్. ఇక ప జనసేనాని తన రోల్ మార్చుకోబోతున్నారు. ఇక పవర్ స్టార్ నుంచి పవర్ పుల్ పొలిటీషన్ అడుగులు వేయబోతున్నాడు. దాదాపు దశాబ్ద కాలం క్రితం జన సేన పార్టీనీ స్థాపించి కేవలం అభిమానుల బలంతోనే పార్టీనీ ప్రారంభించాడు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యాడు. ఆ నాటి నుంచి పవన్ కళ్యాణ్ లో మరింత కసి పెరిగింది. ఎలాగైనా సరే ప్రజల మనస్సును చూరగొనే ఒక రాజకీయ నాయకుడిగా మారాలని పట్టుదలతో కష్టపడి పని చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా గత వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు. పార్టీ పెట్టిన కొత్తలో జనాల నుంచి అంతంత మాత్రంగానే స్పందన ఉండేది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్తా విరామం ఇచ్చి పూర్తి స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టాడో జనాలు కూడా పవన్ కళ్యాణ్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు.
ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులకు అండగా నిలిచిన సమయంలో పవన్ కళ్యాణ్ లో భవిష్యత్తు రాజకీయ నాయకుడు దాగి ఉన్నాడని ప్రజలకు ఓ ఆశ కలిగింది. అలా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలతో నిత్యం ప్రజల మధ్యన ఉంటూ జనసేన పార్టీ జనానికి మరింత చేరువైంది. గత పదేళ్లుగా రాజకీయంగా ఎంతో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొన్న జనసేనాని ఈ సారి ఎన్నికలను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన అంటే ఏంటో చూపించాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో పని చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదని భావించాడు. టీడీపీ ,బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. మొదట్లో కూటమిలో చేరడానికి బీజేపీ కాస్తా వెనుకాడిన పవన్ బీజేపీ పెద్దల మీద ఒత్తడి చేసి కలిసి పోటీ చేసేలా చేశాడంటేనే పవన్ రాజకీయ వ్యూహాలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయమే కూటమి అఖండ విజయానికి నాంది అయ్యింది. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని మంత్రి కావడానికి దోహదం చేసింది.
పవన్ కళ్యాణ్ గెలిచాడు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పవన్ తీరు ఉంది. మొన్నటి వరకు ప్రజా సమస్యలపై పోరాడిన జనసేనాని..ఇప్పుడు అధికారంలోకి వచ్చాము. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దమవుతున్నాడు. తాను అందరి రాజకీయ నాయకుడిలా కాదు . ఎన్నికల మందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి అందుబాటులో ఉంటాను . ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారికి న్యాయం చేసే గురుతర బాధ్యత నామీద ఉందని తన చర్యలతో చెబుతున్నాడు. డిప్యూటీ సీఎంగా అధికారులతో రివ్యూలు ఒక వైపు చేస్తూనే మరోవైపు జనసేనానిగా ప్రజల కష్టాలు తెలుసుకొని తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి విజయంలో పవన్ పాత్ర ఎంత కీలకమో చంద్రబాబు చాలా సార్లు చెప్పాడు. తనతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ పోటో పెడుతున్నారంటే ఈ విజయంలో పవన్ పాత్రను చెప్పకనే చెబుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ ను చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక రకంగా టీడీపీకీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల్లో పవన్ టీడీపీ అండగా జతకట్టడం ఆ పార్టీకీ పవన్ మరింత దగ్గర చేసింది. అందుకే పవన్ కు బాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని టీడీపీ చెప్పుకుంటోంది.
మరోవైపు ఈ ఎన్నికలతో కేంద్ర బీజేపీ పెద్దలకు పవన్ తన సత్తా ఎంటో చాటాడు. కూటమి విజయంతో తాన వ్యూహం ఏంటో బీజేపీకీ తెలిసేలా పవన్ చేశాడు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటులో ఏపీ కూటమిదే ప్రత్యేక పాత్ర. అంతటి కూటమి విజయానికి కారకుడు పవన్ కళ్యాణ్. అది ఎవ్వరూ అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం. అందుకే సాక్షాత్తు ప్రధానీ నరేంద్ర మోడీనే జనసేనాని వపన్ కాదు తుఫాన్ అన్నాడంటేనే పవన్ రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. ఇంకోవైపు తను రాజకీయంగా గేలి చేసిన ప్రత్యర్థులకు సైతం పవన్ గట్టిగా షాక్ ఇచ్చాడు. ఎంత సేపటికి పాత ఓటమిని పదే పదే విమర్శిస్తూ పవన్ ను రెచ్చగొట్టారు. ఆ కసే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పెద్ద నాయకుడిని చేసింది. ప్రత్యర్థుల ఘోర ఓటమికి కారణమైంది.
అధికారంలోకి వచ్చాక కూడా పవన్ తీరు మారలేదు. ప్రజలకు సంబంధించిన విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటున్నాడు. దానికి నిదర్శనం మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఉద్దేశించిన మాటలే నిదర్శనం. అంతేకాదు చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల బీభత్సంపై కర్ణాటక ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడి ఇష్యూను క్లియర్ చేసే పనిలో పడ్డాడు. ఇక నుంచి మీరు తిట్టడం బాగోదేమో అని కొత్తగా స్పీకర్ గా బాద్యతలు చేపట్టిన అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు తాను రాజకీయాల్లో ఎలా ఉంటానో స్పష్టంగా తెలిపినట్లు అనిపించింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాను ప్రజల పక్షమే అన్నట్టుగా పవన్ వ్యవహిరస్తున్నారు. వీలైనంత వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే పవన్ కళ్యాణ్ తపనగా కనిపిస్తోంది. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ రానున్న కాలంలో ప్రజల హామీలను నెరవేర్చడంలో తన దైన పాత్ర పోషిస్తాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని జనసైనికులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తుఫాన్ సృష్టించిన పవన్ , రానున్న రోజుల్లో ఎలాంటి సునామీ సృష్టిస్తారో వేచి చూడాలి.
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter