Naga Chaitanya and Samantha: సమంత గురించి సినీ ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ నటి. వెండి తెర పైన.. ఎన్నో పాత్రలు చేసి ప్రేక్షకులను తెగ అలరించిన ఈ హీరోయిన్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ క్రమంలో నిన్న.. తన మాజీ భర్త నాగచైతన్య నిశ్చితార్థం కాగా.. ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది
ఏం మాయ చేసావే సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత..తెలుగులో వరసగా అవకాశాలు తెచ్చుకునింది. కాగా తన మొదటి చిత్రం.. హీరో నాగచైతన్యతో ప్రేమలో కూడా పడింది.
నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి.. ఎన్నో సినిమాలలో కనిపించారు. అంతేకాదు వీరిద్దరూ తెలుగు ప్రేక్షకుల మదిలో.. బెస్ట్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ కొన్ని సంవత్సరాల క్రింద పెళ్లి చేసుకోగా..అప్పుడు నాగచైతన్య, సమంత అభిమానుల ఆనందానికి.. హవదులు లేకుండా పోయాయి
అయితే ఈ ఆనందం అభిమానులకు.. ఎన్నో రోజులు మిగలలేదు .మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరూ విడాకులు.. ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు. దీనికి కారణం ఏమిటి అని.. అప్పుడు ఎంతోమంది తల పట్టుకున్నారు. అయితే కొంతమంది మాత్రం నాగచైతన్య.. శోభితతో ప్రేమలో ఉన్నాడని.. అందుకే సమంత వదిలేసింది అని చెప్పుకొచ్చారు.
ఇక అప్పుడు వారు చెప్పిందే.. ఇప్పుడు నిజమయింది.. సమంతా నాగచైతన్య విడిపోయి..దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండగా.. ఫైనల్ గా ఇప్పుడు నాగచైతన్య.. శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థం ఆగస్టు 8న.. నాగార్జున నివాసం నందు జరగా.. ఈ నిశ్చితార్థం డేట్ గురించి..ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఇంతకీ విషయం ఏమిటి అంటే.. ఆగస్టు 8న సమంత నాగచైతన్యకి ప్రపోజ్ చేసిందట. మళ్లీ అదే ఆగస్టు 8న నాగ చైతన్య, శోభితని నిశ్చితార్థం చేసుకున్నాడు. మొత్తానికి ఇలా ఆగస్టు 8వ.. తారీకు సమంతకి కూడా ముడి పడడం వల్ల..ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.