Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Mr Bachchan First Review:  రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి వాళ్లు ఏం చెబుతున్నారంటే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 8, 2024, 11:26 AM IST
Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ అంటూ అమితాబ్ బ్రాండ్ ను ఉపయోగిస్తూ తెరకెక్కించిన చిత్రం. దర్శకుడు హరీష్ శంకర్ పై షోలో సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టు కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తో  హిందీ ‘దబాంగ్’ మూవీకి రీమే్ గా తెరకెక్కించిన ఈ  సినిమాలో షోలో విలన్ పాత్రధారి అమ్జద్ ఖాన్ చేసిన గబ్బర్ సింగ్ పాత్రను హీరోకు పెట్టారు. ఇపుడు ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించినా.. పేరు మాత్రం అమితాబ్ బచ్చన్ కే వచ్చింది. అందుకే ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ సినిమా పేరు పెట్టినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వాళ్లు ఈ సినిమా చూసి కొన్ని మితిమీరిన హింస, గ్లామర్ కారణంగా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్లు చెబుతున్న ప్రకారం ఈ సినిమాను 1980లో ప్రముఖ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ సర్ధార్ ఇందర్ సింగ్ జీవితం నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించారు. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇపుడు ఆ సినిమానే తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ తప్పించి మిగతాదంతా రొటిన్ గా ఉన్నట్టు సెన్సార్ సభ్యులు తేల్చిపారేసారు. ఆనాటి వింటేజ్ లుక్ కోసం హరీష్ శంకర్ పడిన తాపత్రయం  తెరపై కనపడ్డా..  ఓవరాల్ గా ఈ సినిమా రొటీన్ యాక్షన్ డ్రామాగా చెబుతున్నారు. ఒక నిజాయితీ గల ఇంకమ్ టాక్స్ ఆఫీసర్.. ఓ రాజకీయ నాయకుడిపై రెయిడ్ చేయడం వలన జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఓ పొలిటిషన్ కు చెందిన గూండాలు, అనుచరులు.. ఇంకమ్ టాక్స్ అధికారులపై దాడులు చేస్తారు. దాన్నుంచి తప్పించుకునే సన్నివేశాలు మినహా సినిమా మొత్తం ఏమి లేదనే టాక్ సెన్సార్ వాళ్ల నుంచి వినిపిస్తోంది.

చివరి 45 నిమిషాలు మాత్రమే స్టోరీ ఉంది. మిగతాదంతా హీరో అమితాబ్ అభిమానిగా.. ఏదో అల్లరి చిల్లరిగానే చూపించాడు. మధ్యలో హీరోయిన్ తో అంగాంగ ప్రదర్శన చూపించాడు. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకు తెలుగులో వరుస అవకాశాలు రావడం పక్కా అని చెబుతున్నారు. ఆమె లుక్స్ కూడా క్యూట్ గా ఉన్నాయి. తొలి సినిమాతోనే ఆమె పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.  ఏది ఏమైనా ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈ వింటేజ్ రీమేక్ .. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News