Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ టూర్‌ ప్యాకేజీ కేవలం రూ.800.. ఇంకా ఎన్నో చూడవచ్చు..!

Nagarjuna Sagar Tour Package: నాగార్జున సాగర్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగిందది. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో సాగర్‌ను పర్యటించడానికి మరింత సులభతరం అవుతుంది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

కృష్ణ నది ఉధృతి పెరగడంతో నాగార్జున సాగర్‌ డ్యామ్ గేట్లు ఎత్తారు. ఈ నేపథ్యంలో సాగర్‌ సోయగాలను చూసేందుకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇది ముఖ్యగా శని, ఆదివారారల్లో ఉంటుంది. ఒక్కరోజులోనే మీరు ఈ ట్రిప్‌కు వెళ్లి రావచ్చు.  

2 /5

వీకెండ్లో హాలిడేతోపాటు పిల్లలకు స్కూలు కావాడంతో పర్యాటకులకు ఇది బాగా కలిసివస్తుంది. ఈ ప్యాకేజీలో బస్సులో ప్రయాణించవచ్చు. ఉదయం 7 గంటల సమయంలో ఈ పర్యాటన మొదలవుతుంది. ఒక్కరోజులో ఈ టూర్‌కు వెళ్లిరావచ్చు. ముఖ్యంగా ఈ బస్సు హైదరాబాద్‌ పర్యాటక భవన్‌ నుంచి ప్రారంభమై బషీర్‌బాగ్‌ చేరుకుంటుంది. ఆ తర్వాత సాగర్‌కు చేరుకుంటుంది.  

3 /5

ఈ పర్యటనలో నాగార్జున సాగర్‌ మాత్రమే కాదు బుద్ద వనం ప్రాజెక్టును కూడా తిలకించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున కొండకు లాంచీలో ప్రయాణించవచ్చు. ఇంకా మ్యూజియం వంటివి కూడా సందర్శించవచ్చు.  

4 /5

రాత్రి సమయంలో లైట్స్ అందాల మధ్య సాగర్‌ అందం మరింత పెరుగుతుంది. ఈ సమయంలో మీకు డ్యామ్‌ మరింత అందంగా కనిపిస్తుంది. రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్‌ తిరిగి చేరుకుంటారు.  

5 /5

నాగార్జున సాగర్‌ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.640 గా నిర్ణయించారు. ఇంకా ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://tourism.telangana.gov.in/package/nagarjunasagartour అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.