White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టే

White Spots on Nails: మనిషి శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. బాహ్య శరీరంలో కన్పించే చాలా మార్పులకు కారణం ఏదో ఒక వ్యాధి అవుతుంటుంది. అందుకే కొన్ని లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2024, 11:24 AM IST
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టే

White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు. చాలామంది ఈ లక్షణాలను చూసి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. తేలిగ్గా తీసుకుంటారు. కాన గోరు రంగు తెలుపుగా మారడం లేదా తెలుపు చారలు రావడం అనేది వివిధ రకాల వ్యాధుల సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త వహించాలి. 

గోర్లపై తెలుపు చారలు లేదా మచ్చలకు కారణం

గోర్లపై తెలుపు చారలు లేదా మచ్చలు రావడమనేది ల్యూకోనీషియాకు సంకేతం. దీనికి చాలా కారణాలున్నాయి. గోరుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తెలుపు మచ్చలు కన్పిస్తాయి. అది కాకుండా కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ లోపమున్నప్పుడు కూడా తెలుపు మచ్చలు కన్పిస్తాయి. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా గోర్లపై తెలుపు మచ్చలకు కారణం కావచ్చు. క్రానిక్ కిడ్నీ వ్యాధుల్లో కూడా గోర్లపై తెలుపు మచ్చలు కన్పిస్తాయి. లివర్ వ్యాధి గ్రస్థులకు కూడా గోర్లపై తెలుపు మచ్చలుంటాయి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు గోర్లపై రంగు మారవచ్చు. డయాబెటిస్ రోగులకు గోర్ల రంగు తెలుపుగా మారుతుంది. లేదా తెలుపు మచ్చలు ఏర్పడతాయి.

గోర్లు పసుపుగా మారడం, గోర్లు లావెక్కడం, గోర్లు తరచూ విరిగిపోవడం, గోర్లలో చారలు ఏర్పడటం, గోర్లు ఊడిపోవడం ప్రధాన లక్షణాలు కావచ్చు. గోర్లపై తెలుపు మచ్చలు కన్పిస్తే ముందుగా డైట్ మార్చుకోవాలి. అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. ఒత్తిడి కూడా గోర్లపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి. గోర్లు శుభ్రంగా ఉంచితే చాలా సమస్యలు నివారించవచ్చు. 

Also read: Maize 7 Amazing Benefits: వర్షాకాలంలో మొక్కజొన్న ఎందుకు తినాలి, 7 అద్భుత ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News