అమరావతి: మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను సమర్పించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. ఇది సాధ్యపడకపోవడంతో కిడారి శ్రవణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది
మవోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వర రావు వారసుడిగా కిడారి శ్రవణ్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తండ్రి మరణించడంతో ఆయన స్థానంలో కిడారి శ్రవణ్ కుమార్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 11న కేబినెట్ విస్తరణలో భాగంగా శ్రవణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకున్నారు
అయితే మంత్రి పదవి చేపట్టిన శ్రవణ్ అరకు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించినందున అరకులో ఉప ఎన్నిక నిర్వహించడం సాధ్యపడలేదు. అలాగే వివిధ కారణాలతో కిడారి శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేకపోయారు. దీంతో శ్రవణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
బ్రేకింగ్ న్యూస్: మంత్రి పదవికి కిడారి శ్రవణ్ రాజీనామా !!