Friendship Day 2024 Top 7 Road Trips: రేపు ఆదివారం ఆగస్టు 4 స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిపి కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా కొన్ని రోడ్ ట్రిప్ లు మనదేశంలో అందంగా ఉన్నాయి ఈ మార్గాల్లో మీ ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది.
హైదరాబాద్ - గోవా.. ఈరోడ్డు మార్గం చాలా అందంగా ఉంటుంది డెక్కన్, వెస్టన్ కోస్టుల అందం హైదరాబాద్ - గోవా మార్గం గుండా ఉంటుంది. ఈ రూట్ చాలా ఎంజాయ్ చేయాల్సింది. గోవా బీచ్ల అందం ఆ అద్భుత దృశ్యాలు చూడదగినవి.
చెన్నై -పాండిచ్చేరి.. స్నేహితులతో రోడ్డు ట్రిప్ వెళ్లాలనుకుంటే చెన్నై -పాండిచ్చేరి కూడా అద్భుతం. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రోడ్లన్నీ అందంగా ఉంటాయి. ఇక్కడి అరేబియా సముద్ర దృశ్యాలు పాండిచ్చేరి ఫ్రెంచ్ క్వార్టర్, బీచెస్ చూడదగినవి.
బెంగళూరు -కూర్గ్.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ ఫ్రెండ్స్ తో వెళ్లాల్సిన మరో రోడ్డు మార్గం బెంగళూరు - కూర్గ్ వెళ్లాల్సిన అందమైన గ్రీనరీ దృశ్యాలు కళ్ళను మైమరిపించేలా చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ రోడ్డు మార్గం ఎంతో బాగుంటుంది. ఇక్కడ కాఫీ ఎస్టేట్లు ఎంతో అందంగా ఉంటాయి మంచి జలపాతాలు కూడా చూడదగినవి.
ఢిల్లీ - జైపూర్.. ఇక్కడి చారిత్రాత్మక, నాగరికత ఈ దారి గుండా వెళ్తూ మీరు తెలుసుకుంటారు. మీ స్నేహితులతో ఈ ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ఎంతో బెస్ట్ ఆప్షన్ ఇక్కడ అంబర్ ఫోర్ట్, హవా మహల్ ఎంతో అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాజస్థానీ వంటకాల రుచి అదిరిపోతుంది.
ముంబై - గోవా మీకు బీచెస్ అంటే భలే ఇష్టమా? అయితే నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తో పాటు ముంబై నుంచి గోవా ట్రిప్ వేయండి. ఇది ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ కొంకన్ కోస్టు బ్యూటిఫుల్ అందమైన కోస్టల్ దృశ్యాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి. అందమైన గ్రామాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇసుకతో ఉండే బీచ్లు వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి.
మనాలి - లేహ్.. ఫ్రెండ్స్ తో పాటు రోడ్డు ట్రిప్ వేయాల్సిన మరో రోడ్డు మార్గం మనాలి నుంచి లేహ్. ఇక్కడ ప్రకృతి అందాలు మన కళ్లను మైమరిపింపజేస్తాయి, ఆహ్లాదకరమైన దృశ్యాలు చూడదగినవి.