No Blame To Arshdeep Singh Tie With Sri Lanka First ODI: టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత అభిమానులు అర్షదీప్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ అక్కడ జట్టు మొత్తం వైఫల్యం చెందిందని విశ్లేషకులు చెబుతున్నారు.
India vs Sri Lanka Highlights: టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత అభిమానులు అర్షదీప్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
India vs Sri Lanka Highlights: భారత్, శ్రీలంక మధ్య మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాల్సిన అవసరం ఉంది. 15 బంతులు మిగిలి ఉన్న సమయంలో పదో బ్యాటర్‌గా ఫీల్డ్కి అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు.
India vs Sri Lanka Highlights: మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. మొదటి అర్థ భాగంలో వరుసగా ఐదు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది. 231 సాధారణ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆరు, ఏడో స్థానంలో ఫీల్డ్కి వచ్చిన కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33) రాణించారు.
India vs Sri Lanka Highlights: దురదృష్టవశాత్తు అసలంగా బౌలింగ్‌లో యువ బ్యాటర్ శివం దూబే ఎల్బీడబ్ల్యూగా మైదానం వీడాడు. ఇంకొక వికెట్ తీసి ఉంటే శ్రీలంక విజయం సాధించి ఉండేది. మరో వైపు భారత్ జట్టు చేతిలో ఉన్న 15 మంది బంతుల్లో ఒక్క పరుగు సాధించినా భారత్ గెలిచేది.
India vs Sri Lanka Highlights: ఈ సమయంలో చివరి ఆటగాడిగా మైదానానికి వచ్చిన అర్షదీప్ సింగ్ ఎదుర్కొన్న మొదటి బంతినే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా మ్యాచ్ టైగా ముగిసింది.
India vs Sri Lanka Highlights: విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. జట్టు టైగా మారడంపై భారత అభిమానులు అర్ష్‌దీప్ సింగ్‌ను తప్పుబడుతున్నారు.
India vs Sri Lanka Highlights: మ్యాచ్ లో అర్ష్‌దీప్‌ను తప్పుబట్టడం కాకుండా వాస్తవంగా బ్యాటర్లందరూ బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. కేవలం అర్షదీప్ సింగ్‌ను విమర్శించడం సరికాదని విమర్శకులు సూచిస్తున్నారు.