Nayanthara personal life: నయనతార గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళంలో ఏకంగా.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. తాజాగా నాయనతార ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. తెగ వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఈమధ్య ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా.. ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ భామ నయనతార. చంద్రముఖి సినిమా తరువాత నుంచి.. తమిళంలో, తెలుగులో రెండిటిలో కూడా భారీ ఆఫర్లు అందుకుంది. తెలుగులో లక్ష్మీ, తులసి లాంటి విజయాలను అందుకున్న నయనతార.. తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది.
ముఖ్యంగా తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్..సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. అంతేకాదు తమిళనాడులో.. ఈమెకు పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. అందుకే అక్కడ ఈమెను లేడీ సూపర్ స్టార్ అని కూడా అంటారు.
కాగా ఈ మధ్యనే విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే సినిమాలను మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు నయనతార షారుక్ ఖాన్ హీరోగా.. వచ్చిన జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో కూడా సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం నయనతారకి అక్కడ కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలో జవాన్ సినిమా అప్పుడు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిన నయనతార.. ఇంస్టాగ్రామ్ లో కూడా తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక నయనతార ఈమధ్య బిస్కెట్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
మరోపక్క.. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో నయనతారకి ఒక ప్రశ్న ఎదురవ్వగా.. దానికి ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది ఈ హీరోయిన్. మీరు హీరోయిన్ కాకపోతే ఏమై ఉంటారు అని అడగగా.. ఆమె చార్టెడ్ అకౌంట్ అయి ఉంటాను.. అని చెప్పింది. ఇక నయన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.