Remedies for Sade sathi Effect: శనిదేవుడు మనంచేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. అందుకు ప్రతి ఒక్కరు మంచి పనులు చేయాలని పండితులు చెప్తుంటారు.
శనివారం శనికి ఇష్టమైన రోజుగా చెప్తుంటారు. చాలా మంది శనిదేవుడి ఆలయంకు నువ్వుల నూనె, నల్ల నువ్వులు తీసుకుని వెళ్తుంటారు. కానీ కొన్ని తప్పులు చేస్తారు.
శనికి తైలాభిషేకంచేసేటప్పుడు ఆయనకు ఎదురుగా ఉండి నూనె పోయకూడదు. అదే విధంగా శనిదేవుడి విగ్రహంమీద వేసిన నూనెను అభిషేకం తర్వాత మంచి నీళ్లలో శుభ్రం చేయాలి.చక్కెర, తేనె వంటి పదార్థాలను వేయకూడదు. దీని వల్ల విగ్రహానికి చీమలు పడుతాయి.
కేవలం శుభ్రమైన బట్టలు వేసిన దేవుడి దగ్గరకు వెళ్లాలి. మాసిపోయిన బట్టలు,రాత్రి వేసుకున్నబట్టలు మరల వేసుకుని శనిదేవుడి దగ్గరకు వెళ్లకూడదు. లుంగీ వేసుకుని పూజలు చేయాలి
శనిదేవుడికి నల్లటిబట్ట, నల్ల నువ్వులు, ఇనుము,ఉప్పు అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు. ముఖ్యంగా సాడేసాతి, ఏలినాటి శని వల్ల ఇబ్బందులు ఎదురైతే.. ఇవి దానంగా ఇవ్వాలి.
శనివారం రోజున కొత్తచెప్పులు, నల్ల బట్టలు, ఇనుము, ఉప్పు వంటికి ఇంటికి తీసుకొని రావద్దు. అలాగే.. ఈరోజున ఎవరికి కూడా డబ్బులను ఇవ్వకూడదని చెప్తుంటారు (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)