Best Business Ideas: మీరు అతి తక్కువ పెట్టుబడిలో మంచి వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మీరు తక్కువ పెట్టుబడితో అలాగే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అది కూడా రెగ్యులర్ గా మీకు సీజన్ తో సంబంధం లేకుండా ఆదాయం లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Small Business Ideas: ఒకప్పుడు పిల్లలంతా పార్కుల్లోనూ గ్రౌండ్ క్రికెట్ ఆడుకునేవారు. అయితే ప్రస్తుతం నగరాల్లోనూ పట్టణాల్లోనూ పార్కులు గ్రౌండ్లు కనపడకుండా పోయాయి. ఆ ప్రదేశాల్లో కాంక్రీట్ జంగిల్స్ మిగిలాయి. దీంతో పిల్లలు క్రికెట్ లాంటి ఆటలను ఆడేందుకు స్థలం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ మీ ముందు ప్రవేశపెడుతున్నాం. అదే బాక్స్ క్రికెట్.
ఈ కాన్సెప్ట్ అనేది ప్రస్తుత కాలంలో అన్ని ప్రాంతాల్లోనూ చాలా మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ గా మారుతోంది. ఇందుకోసం మీరు కేవలం ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. మీకు నిరంతరం ప్రతిరోజు ఆదాయం లభించే అవకాశం ఇందులో ఉంటుంది. ఈ బాక్స్ క్రికెట్ కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా బాక్స్ క్రికెట్ కోసం మీరు కనీసం 300 గజాల నుంచి 500 గజాల స్థలం అయితే సరిపోతుంది. ఇందులో మీరు చుట్టూ చతురస్రం ఆకారంలో స్తంభాలను పాతి బాక్స్ రూపంలో తయారు చేయాల్సి ఉంటుంది. ఈ స్తంభాలను కవర్ చేస్తూ నెట్ వేయాలి. లోపల లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అలాగే గ్రౌండ్ కోసం మీరు ఆర్టిఫిషియల్ గ్రాస్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అదే విధంగా పిచ్ కోసం కూడా మ్యాట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇందుకోసం మొత్తం ఖర్చు రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది
ఒకవేళ మీకు స్థలం దొరకకపోతే మీ బిల్డింగ్ మీద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అయితే అందుకు అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇక ఈ బాక్స్ క్రికెట్ కోసం మీరు రెంట్ ప్రాతిపదికన వ్యక్తులకు ఇవ్వవచ్చు. తద్వారా మీరు ప్రతిరోజు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఈ బాక్స్ క్రికెట్ కోసం మీరు గంటల ప్రాతిపదికన ఆయా టీములకు పిచ్ అద్దెకు ఇవ్వవచ్చు ప్రస్తుతం కనీసం 1 గంటల నుంచి 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు చొప్పున వేరు వేరు ధరలకు ఈ బాక్స్ క్రికెట్ పిచ్ రెంటుకు ఇవ్వడం ద్వారా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. లైటింగ్ ఏర్పాటు చేసుకుంటే నైట్ టైం కూడా మీరు ఆదాయం పొందవచ్చు. ఈ బాక్స్ క్రికెట్ తో పాటు మీరు అనుబంధంగా కెఫెటేరియా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జ్యూస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
Note: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారం వ్యాపార సలహాగా చూడకూడదు. జీ న్యూస్ తెలుగు పోర్టల్ ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు. నిపుణులు సలహా మేరకు మాత్రమే మీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి.