Megastar Chiranjeevi rude behaviour with fans in shamshabad airport: సాధారణంగా కొందరు కొన్నిరంగాల్లో ఎక్కువగా రాణిస్తుంటారు. ముఖ్యంగా సినిమా, రాజకీయాలు, క్రీడారంగంలో తమ టాలెంట్ తో అందరి మనస్సులు గెలుచుకుంటారు. వీరిని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే తమ మనస్సుకు నచ్చిన వాళ్లు ఎక్కడైన కన్పిస్తే, వారితో మాట్లాడటానికి, ఆటో గ్రాఫ్ తీసుకొవడానికి, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కనీసం ఒక్కసారైన దగ్గరి నుంచి మాట్లాడటానికి తెగతాపత్రయపడిపోతుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు అభిమానులు కూడా అతిగా ప్రవర్తిస్తుంటారు. కొందరు కావాలని చేతులు వేయడం, మీద పడినట్లు చేస్తుంటారు. ఇక మరికొన్నిసార్లు వీరి స్టార్ లు కూడా అభిమానులు ఫోటోలు దిగుతామంటే ఇష్టపడరు.
సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే
అది off the Camara లో @KChiruTweets అయినా
ఇంకెవరైనా....
ముందు వాళ్ళని అంతా ఎత్తులో చూడడం మానేయాలి.
నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి ఎవరికైనా...@NewsmeterTelugu@TeluguScribe @TV9Telugu @V6News @ANI pic.twitter.com/Rs78NOV0WG— AdvKatkuri (@AdvKatkuri) July 29, 2024
కొన్నిసార్లు ఫ్యాన్స్ పట్ల.. స్టార్స్ కూడా రూడ్ గా కూడా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ లో బాలయ్య.. అభిమానులను తరచుగా కొడుతుంటారు. అందుకే ఆయన దగ్గరుంటే చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. మరికొందరు ఆయన కోపంగా ఉండటం, చేయిచేసుకొవడం కామన్ గా భావిస్తారు. కానీ ఇండస్ట్రీలో ఎంతో కూల్ గా ఉండే మెగాస్టార్ ఇప్పుడు ఒక అభిమానిని తోసేయ్యడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాలు..
కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడానికి ప్యారిస్ వెళ్లిన విషయం తెల్సిందే. కుటుంబంతో కలిసి కొన్నిరోజులపాటు పారిస్ లో సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు.. ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నంచేశారు. ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే ఇండిగో సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో చిరంజీవి కాస్తంతా అసహానానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఆయన నడుస్తుండగా.. ఇండిగోలో పనిచేసే అభిమాని సెల్పీ కోసం ట్రై చేశాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన చేతులతో అభిమానిని పక్కకు తోసేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సెల్ఫీయేగా అడిగింది.. మరీ ఇంత దారుణంగా ఉండకూడదని, అభిమానుల వలనే చిరు మెగాస్టార్ అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు.
Read more: Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు..
ఇంకోపక్క ఇండిగో సిబ్బందిని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చేవారు.. అందరికి సెల్ఫీలు ఇస్తూ ఉంటే వాళ్లకు ఓపిక ఉండొద్దా.. ? అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరికొంత మంది ఇదే ప్లేస్ లో బాలయ్య ఉంటే పట్టించుకునే వారు కాదని.. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇలా చేయడం తట్టుకొలేక పోతున్నామని కొందరు నెటిజన్ లు తిట్టిపోస్తున్నారు. మరి ఈ ఘటనపై చిరు ఎలా స్పందిస్తాడో మాత్రం చూడాలి.ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter