Ola Electric Mobility: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ IPO ఆగస్టు 2, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఓలా ఎలక్ట్రిక్ తాజా ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియ ద్వారా సుమారు 5500 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీఓ కోసం యాంకర్ రౌండ్‌ను ఆగస్టు 1న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఓలా ఎలక్ట్రిక్ IPO ఆగస్టు 2-6 తేదీల మధ్య రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్లను వేసేందుకు కోసం ఐపీవో తెరుచుకోనుంది.EV కంపెనీ IPO ఆగస్టు 9న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయ్యే చాన్స్ ఉంది.దీంతో ఐపీఓ ప్రారంభించిన తొలి భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీగా అవతరిస్తుంది.
IPO ద్వారా కంపెనీ ఎంత డబ్బు సమకూరుస్తుంది?
ఓలా ఎలక్ట్రిక్ తాజా ఇష్యూ , OFS ద్వారా సుమారు 5500 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల EV కంపెనీ IPO నుండి సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువను పొందే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇది దాని మునుపటి ఫండింగ్ రౌండ్‌లో సుమారు 5.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కంటే 18 శాతం తక్కువ.ఎలక్ట్రిక్ EV సెగ్మెంట్‌లో, Ola EV తయారీ కంపెనీలైన ఏథర్ ఎనర్జీ, బజాజ్, TVS మోటార్ కంపెనీలతో పోటీ పడుతుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో వివరాలు:
ఓలా ఎలక్ట్రిక్ తన DRHPని డిసెంబర్ 22, 2023న SEBIకి సమర్పించింది.జూన్ 20న, Ola Electric IPO కోసం మార్కెట్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది.ఈ ఆమోదంతో,ఓలా ఎలక్ట్రిక్ లిస్టయిన మొదటి భారతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీగా అవతరించడానికి మార్గం సులభమైంది.ఈ IPOలో 4.74 కోట్ల షేర్లను (3.48 శాతం వాటా) విక్రయించాలని అగర్వాల్ యోచిస్తున్నారు.ఇండస్ ట్రస్ట్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, డిఐజి ఇన్వెస్ట్‌మెంట్స్, ఇంటర్నెట్ ఫండ్-3 (టైగర్ గ్లోబల్),మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్,మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ఆల్ఫా వేవ్ వెంచర్స్ ,టెక్నే ప్రైవేట్ వెంచర్స్ వాటాలను విక్రయించే ఇతర వాటాదారులుగా ఉన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ ఏం చేస్తుంది?
ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో EVలు ,బ్యాటరీ ప్యాక్‌లు,మోటార్లు ,వాహన ఫ్రేమ్‌ల వంటి కీలక భాగాలను తయారు చేస్తుంది. 10 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ప్లాంట్‌గా ఫ్యాక్టరీని విస్తరిస్తున్నారు. కంపెనీ తమిళనాడులో లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది, దీని ప్రారంభ సామర్థ్యం గంటకు 5 GW. తర్వాత దశలవారీగా ఈ సామర్థ్యాన్ని గంటకు 100 గిగావాట్లకు పెంచే యోచనలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter