Types Of Salt: మీకు సరిపోయే ఉప్పును ఎలా ఎంచుకోవాలి? ఎందులో ఏ ప్రత్యేకత ఉందో తెలుసా?

 Types Of Salt Used: ఉప్పు లేని కూర రుచించదు. అయితే, మీ ఆరోగ్యానికి సరిపోయే ఉప్పును ఎలా ఎంచుకోవాలి తెలుసుకుందాం.
 

1 /7

సాధారణ ఉప్పు.. ఉప్పులో ప్రధానమైన సోడియం రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఈ ఉప్పు అయోడిన్ లోపాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌లు, కడుపు ఆమ్లాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

2 /7

కోషర్ ఉప్పు.. తక్కువ సోడియం తినమని డాక్టర్లు సలహా ఇచ్చే వ్యక్తులకు మంచిది. అయోడిన్ లేకుండా స్వచ్ఛమైన ఉప్పు కోసం చూస్తున్న వారికి ఇది మంచిది.  

3 /7

సెల్టిక్ ఉప్పు.. ఇది సోడియం ఇతర ఎలక్ట్రోలైట్‌ల సహజ సంతులనాన్ని కలిగి ఉంటుంది.రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది మంచిది, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.  ఇది ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది.

4 /7

లో సోడియం ఉప్పు.. తక్కువ సోడియం ఆహారం అవసరమయ్యే అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ వ్యాధి లేదా పొటాషియం విసర్జనకు ఆటంకం కలిగించే ఇతర పరిస్థితులు ఉన్నవారికి పొటాషియం అధికంగా తీసుకోవడం హానికరం .

5 /7

సముద్ర ఉప్పు..  జీర్ణక్రియకు సముద్రపు ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది. ఇందులో పొటాషియం ,మెగ్నీషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రిసతుంది. అంతేకాదు ఇందులో మినరల్స్ ,మెగ్నీషియం, కాల్షియం ,పొటాషియం వంటి మూలకాలు ఉన్నాయి

6 /7

 పింక్ సాల్ట్‌.. ఈ ఉప్పులో ఉన్న సోడియం ఇతర ఎలక్ట్రోలైట్స్ సహజ సంతులనం  పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, జింక్‌ ఉంటుంది.

7 /7

నల్ల ఉప్పు.. ఇది జీర్ణక్రియకు సహాయం చేయడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)