Kangana ranaut: చిక్కుల్లో ఎంపీ కంగానా రనౌత్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. కారణం ఏంటంటే..?

Bjp mp Kangana Ranaut: మండి ఎంపీ కంగానా రనౌత్ కు హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కిన్నౌర్ నివాసీ  రామ్ నేగి .. అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 25, 2024, 10:32 AM IST
  • కంగానాకు ఊహించని ట్విస్ట్..
  • ఆగస్టు 21 వరకు డెడ్ లైన్ విధించిన కోర్టు..
Kangana ranaut: చిక్కుల్లో ఎంపీ కంగానా రనౌత్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. కారణం ఏంటంటే..?

Himachal Pradesh highcourt issues notice to Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నినెలల క్రితం  ఎంపీ కంగానాను ఒక లేడీ కానిస్టేబుల్ చెంప మీద కొట్టింది. రైతు ఉద్యమంపై కంగానా వ్యాఖ్యల పట్ల చేయిచేసుకున్నట్లు లేడీ కానిస్టేబుల్ చెప్పుకొచ్చింది. అది దేశంలో పెద్ద దుమారంగా మారింది. ఇక తాజాగా, కన్వర్ యాత్రపై రియల్ హీరో సోనూసూద్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేంగా కూడా, ఎక్స్ లో రెచ్చిపోయారు.

ఏకంగా హలాల్ పై ఎందుకు వ్యాఖ్యలు చేయరని కూడా సోనూసూద్ కు గట్టిగానే కౌంట్ ఇచ్చారు. ఈ వివాదం కూడా వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.  మరోవైపు.. తాజాగా, హిమచల్ ప్రదేశ్ హైకోర్టు కంగానాకు మండి ఎన్నిక విషయంలో తాజాగా నోటీసులు జారీచేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Read more: Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..

పూర్తి వివరాలు..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగానా మండి నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. అదే విధంగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో కంగనా విజయం సాధించారు. సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా..లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.

గతంలో అటవీ శాఖలో పని చేసిన రామ్ నేగీ పదవీ విరమణ తరువాత.. రిటర్నింగ్ అధికారి(మండి డిప్యూటీ కమిషనర్)కి నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్‌మెంట్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో.. విద్యుత్‌, నీరు, టెలిఫోన్‌ శాఖల నుంచి ‘నో డ్యూ సర్టిఫికేట్‌’ సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇవ్వగా, రిటర్నింగ్‌ అధికారి వాటిని ఆమోదించలేదని.. పైగా నామినేషన్‌ పత్రాలను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more: Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?

ఒక వేళ అధికారులు తన నామినేషన్ స్వీకరించి ఉంటే... మండి నుంచి గెలిచేవాడినంటూ కూడా చెప్పుకోవచ్చారు. తన నామినేషన్ ను ఉద్దేషపూర్వకంగా పక్కన పెట్టినందుకు ఎంపీ కంగానా గెలుపును రద్దు చేయాలని రామ్ నేగీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని వెనుక కంగానా రనౌత్ పాత్ర కూడా ఉందని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. రామ్ నేగీ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని కూడా కంగానాకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాది ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వలని కోరుతూ హిమచల్ ప్రదేశ్ ధర్మాసం ఆగస్టు 21 వరకు కంగాకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగానా మరోసారి వార్తలలో నిలిచారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News