Raviteja Mr Bachchan: సినిమా వర్కౌట్ అవ్వాలి అంటే..అన్నిటికంటే ముందు సినిమా కథ, కథనం.. బావుండాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా రిజల్ట్ అనేది కేవలం ఈ విషయం మీద మాత్రమే ఆధారపడదు. విడుదల చేస్తున్న సమయం, సినిమా ప్రమోషన్లు.. కొన్ని కొన్ని సార్లు సినిమా రన్ టైం.. కూడా సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తాయి.
అన్నిటికంటే ఎక్కువగా అదృష్టం.. కూడా సినిమా రిజల్ట్ మీద ఎంతో కొంత.. ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది సినిమా వాళ్లకి కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఉదాహరణకి త్రివిక్రమ్.. చాలా వరకు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లని పెడతారు. ఇలా చాలామంది స్టార్ సెలబ్రిటీలకి.. కూడా ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది.
తాజాగా ఇప్పుడు రవితేజ అభిమానులు కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ తో.. రవితేజ హిట్ అందుకుంటారని కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే వచ్చే నెల ఆగస్టు 15న..రెండు సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది రవితేజ హీరోగా నటిస్తున్న.. మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్.
అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ రావడం ఇది మొదటిసారి కాదు. 2021 లో కూడా రామ్ హీరోగా నటించిన రెడ్, రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలు రెండు సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల్లో.. రవితేజ క్రాక్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రామ్, రవితేజ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు రవితేజ సినిమా బ్లాక్ బస్టర్.. అయింది. మరి ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయితే బాగుంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే రవితేజతో పాటు రామ్ కి ..కూడా తన సినిమా హిట్ అవ్వడం కీలకంగా మారబోతోంది.
ఇక రెండు సినిమాలు మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రవితేజ సినిమా హిట్ అవుతుందా లేక రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా వేచి చూడాలి.
Also Read: Raj Tarun: న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ని కలుస్తాను.. రాజ్ తరుణ్ మాజీ లవర్ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి