Realme GT 6T Price Cut: భారత మార్కెట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తిరుగులేని కంపెనీగా అవతరించింది. ఎప్పటికప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తూ మార్కెట్‌లో తమదైన శైలిలో ముంద్ర వేసుకుంది. ఇదిలా ఉంటే రియల్ మీ కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన Realme GT 6T స్మార్ట్‌ఫోన్ మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొత్త కలర్ ఆప్షన్‌లో తీసుకు రాబోతోంది. ఇది చూడడానికి అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్‌లో లభించనుంది. అయితే ఈ మొబైల్‌ను కంపెనీ మిరాకిల్ పర్పుల్ ఆప్షన్‌లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ Realme GT 6T మొబైల్‌ను కంపెనీ ఇటీవలే చైనాలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కొత్త కలర్ ఆప్షన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
మిరాకిల్ పర్పుల్ వివరాలు:
ఈ కొత్త కలర్ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ గతంలో లాంచ్ చేసిన మొబైల్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు అందించలేదని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ మిరాకిల్ పర్పుల్ వేరియంట్ మొబైల్ మాత్రం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులోని మొదటి వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ధర రూ. 32,999 అందుబాటులోకి రానుంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ధర రూ. 35,999తో లభించనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయితే ధరల్లో స్పల్ప మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫ్లూయిడ్ సిల్వర్‌తో పాటు రేజర్ గ్రీన్ కలర్ వేరియంట్ నాలుగు విభిన్న స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ రూ.32,999లతో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999తో అందుబాటులో ఉంది. ఇక చివరి వేరియంట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ధర రూ.39 వేలలోపు లభిస్తోంది.
ఈ మిరాకిల్ పర్పుల్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్ వివరాల కంపెనీ అధిరికంగా వెల్లడించింది. ఈ మొబైల్‌ను జూలై 20న Realme India అధికారిక వెబ్‌సైట్‌లో మొదటి సేల్‌తో కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. ఆ తర్వాత కంపెనీ దీనని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అలాగే రియల్‌మీ కంపెనీ రియల్‌మీ బడ్స్ ఎయిర్ 6 జూలై 15 నుంచి అందుబాటులోకి తీసుకు రానుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లే
6000 nits పీక్ బ్రైట్‌నెస్
120Hz రిఫ్రెష్ రేట్
HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్
Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్
120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5500mAh బ్యాటరీ
50-మెగాపిక్సెల్ Sony LYT600 ప్రధాన కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
32-మెగాపిక్సెల్ కెమెరా
ఆండ్రాయిడ్ 14
బ్లూటూత్ 5.4
వైఫై 6
డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి