వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ పై టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వివేక కుమార్తె సునీత మరోమారు స్పందించారు. హత్య ఘటన కు సంబంధించిన సమాచారం పోలీసులకు లేటుగా అందించామని కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సునీత మండిపడ్డారు. వాస్తవానికి తన తండ్రి హత్య విషయం ఉ. 6.40 గంటలకే తాము పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. డెత్ స్పాట్లో ఏం జరిగిందో పులివెందుల సీఐకి తెలుసు అని సునీత పేర్కొన్నారు
తన తండ్రి వివేక జగనన్నను సీఎం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని సునీత పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతలందరితో నాన్నకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని... నాన్న ప్రచారం చేస్తే ఓడిపోతామనే భయం ఆదినారాయణ వర్గంలో ఉందన్నారు. తన తండ్రి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాన్ని సునీత వ్యక్తం చేశారు
వివేక హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో కపడ జిల్లా ఎస్పీని బదిలీ చేశారనే కారణాన్ని చూపి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వివేక హత్యతో జగన్ కు లింప్ పెడుతూ ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మరోమారు మీడియా ముందుకు వచ్చిన వివేక కుమార్తె సునీత..తన తండ్రి హత్య కేసును ప్రస్తావిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు సంధించడం గమనార్హం.