Post office Superhit Scheme: పోస్టాఫీసుల్లో వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటున్నాయి. వడ్డీ రూపంలో అత్యధిక రిటర్న్స్ ఉండటమే కాకుండా రిస్క్ లేకపోవడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలు కూడా ఉన్నాయి. కొన్ని పథకాలు సూపర్ హిట్ అవుతుంటాయి.
పోస్టాఫీసులు అందించే వివిధ రకాల పథకాల్లో సూపర్ హిట్ స్కీమ్ ఒకటుంది. వడ్డీ లక్షల్లో వస్తుంది. అదే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్. ఐదేళ్ల ఈ పధకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా బాగుంటాయి. పోస్టాఫీసు పధకాల్లో ఇది అత్యంత ఆదరణ పొందిన పథకంగా ఉంది. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బుల్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పోస్టాఫీసుల్లో చిన్న మొత్తం పొదుపు పధకాల్లో కూడా రిటర్న్స్ బాగుంటాయి. ఇక పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ అయితే పెద్దఎత్తున వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ పధకంలో వడ్డీ 7.5 శాతం లభిస్తుంది.
2024 ఏప్రిల్ 1న ఇదే పధకంపై వడ్డీ 7 నుంచి 7.5 శాతానికి పెరిగింది. అంటే ఏకంగా 0.50 శాతం పెరిగింది. దాంతో పోస్టాఫీసులోని ఇతర పథకాలతో పోలిస్తే ఇది చాలా ఆదరణ సంపాదించుకుంది. పోస్టాఫీసు పథకాల్లో వివిధ కాల పరిమితుల్ని ఎంచుకోవచ్చు. ఈ పధకంలో కూడా 1,2,3,5 ఏళ్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది కాల వ్యవధికైతే వడ్డీ 6.9 శాతం లభిస్తుంది. అదే 2-3 ఏళ్లకైతే 7 శాతం వడ్డీ ఉంటుంది. ఇక 5 ఏళ్ల కాల వ్యవధికి డబ్లులు డిపాజిట్ చేస్తే 7.5 శాతం వడ్డీ అందుతుంది.
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఎవరైనా 5 ఏళ్ల కాల వ్యవధికి 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దానిపై వడ్డీ 7.5 శాతం వస్తుంది. అంటే 5 లక్షలకు ఐదేళ్లలో వచ్చే వడ్డీ 2,24,974 రూపాయలవుతుంది. అసలు 5 లక్షలతో కలిపి ఐదేళ్ల తరువాత 7,24,974 రూపాయలు అందుకోవచ్చు. ఈ స్కీమ్‌కు ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80 సి వర్తిస్తుంది. దాంతో ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ పధకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం 1000 రూపాయలు కాగా ఏడాదికోసారి వడ్డీ జమ అవుతుంది.
Also read: LPG Price Cut Down: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook