Vijay Devarakonda in Kalki part 2: టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. నాగ్ అశ్విన్ రూపొందించిన..మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించగా.. దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. భారీ విజయం సాధించి కలెక్షన్ల మోత మోగిస్తోంది.
సినిమాలో ముఖ్యంగా క్యామియో పాత్రలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో..విజయ్ దేవరకొండను అర్జునుడి పాత్రలో చూపించారు. ఈ పాత్ర కి మంచి ఆదరణ లభించింది. అయితే, కల్కి 2 లో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందా.. లేదా.. అనేది హాట్ టాపిక్ గా మారింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో..విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుంది. కల్కి 2898 ఏడి లో కూడా ఉంది. మరి కల్కి 2 లో ఉండాలి అంటే విజయ్.. అర్జునుడు.. కాబట్టి మళ్ళీ మహాభారతం ఎపిసోడ్ పెట్టి.. అందులో క్యామియో గా చూపించాలి. అయితే తాజాగా ఈ ప్రశ్నలకి నాగ్ అశ్విన్ జవాబు ఇచ్చారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, దర్శకుడు నాగ్ అశ్విన్..విజయ్ దేవరకొండ పాత్ర కల్కి లో కేవలం క్యామియో మాత్రమే కాదని, ఆ పాత్ర సినిమా కథలో.. ఒక ముఖ్య భాగమని చెప్పారు. ఈ ప్రకటనతో విజయ్ దేవరకొండ.. అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోయారు.
సినిమా కథ ప్రకారం, 2898 ఏడి లో కర్ణుడు పునర్జన్మ తీసుకుని భైరవగా కనిపించాడు. అదే విధంగా అర్జునుడు పాత్ర..పోషించిన విజయ్ దేవరకొండ కూడా పునర్జన్మ ఉంటేనే కల్కి 2 లో కనిపిస్తాడు. ఎలాగో కల్కి లో భాగం కాబట్టి విజయ్ దేవరకొండ పాత్ర మళ్ళీ పుడుతుంది.. అని అందరూ అంటున్నారు.
అయితే మళ్ళీ పుట్టిన విజయ్ దేవరకొండను.. ఎలా చూపిస్తారన్నదే.. ఇప్పుడు ఆసక్తికర విషయం. అయితే సినిమాలో నాలుగో ప్రపంచం కూడా ఉండే అవకాశముందని.. నాగ్ అశ్విన్ అన్నారు. అలా అయితే విజయ్ దేవరకొండ కూడా ఆ నాలుగవ ప్రపంచంలో ఉంటాడా.. అని కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read: Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?
Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter