Samantha: సమంత పై ఫైర్ అయిన డాక్టర్.. సామ్ కి మద్దతు పలికిన హీరో.. స్పందించిన నటి

Samantha receives backlash: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు.. మందులు వాడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది అంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ కామెంట్లలో ఆమెపై ఫైర్ అయ్యారు. ఇలా ప్రజలను మిస్ గైడ్ చేయడం కరెక్ట్ కాదని మందిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 5, 2024, 11:51 AM IST
Samantha: సమంత పై ఫైర్ అయిన డాక్టర్.. సామ్ కి మద్దతు పలికిన హీరో.. స్పందించిన నటి

Samantha Viral Instagram Post: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. గత కొద్ది రోజులుగా సినిమాలలో కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఉండే సమంత తాజాగా ఇన్స్తాగ్రామ్ లో మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. టాబ్లెట్లు వాడటం కంటే ఇలా చేస్తే సరిపోతుంది.. అంటూ నేబులైజర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తూ ఫోటో పెట్టింది. 

"మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడండి. అందులో ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ రెండూ కలిపి నేబులైజర్ చేయండి. ఇది మ్యాజిక్ లాగా పని చేస్తుంది. అనవసరంగా టాబ్లెట్లు వాడకుండా ఇలా ప్రయత్నించండి" అంటూ ఈ విషయాన్ని తనకి మిత్ర బసు అనే ఒక డాక్టర్ చెప్పినట్లుగా ఆమెను ట్యాగ్ చేసింది.

అయితే ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ సమంత పై ఫైర్ అయ్యారు. ఆ సలహా తప్పు అని కొట్టి పారేశారు. ఇలా చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది అని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి పోస్టులు పెట్టడం కూడా తప్పు అని వారించారు. 

దానికి హీరో రాహుల్ రవీంద్ర రియాక్ట్ అయ్యారు. ఎప్పటినుంచో సమంతకి మంచి స్నేహితుడు.. అయిన రాహుల్ రవీంద్ర "ఈ విషయం గురించి మీరు సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ తో వాదిస్తే మంచిది" అంటూ సమంతకి మద్దతు పలికారు. ప్రస్తుతం సమంత పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

అయితే ఈ విషయంపై సమంత కూడా స్పందించింది. తనకు డబ్బు ఉంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోగలిగిందని.. అయితే అందుకు గల వేరే వైద్య పద్ధతుల గురించి రీసెర్చ్ చేసి.. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధానాలు తాను చెప్పానని.. ఆ పోస్టుకి తనకు ఆ సలహాలు ఇచ్చిన డాక్టర్ని కూడా ట్యాగ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇక తన గురించి నెగిటివ్ పోస్ట్ చేసిన డాక్టర్.. తానును కాకుండా.. తాను ట్యాగ్ చేసిన డాక్టర్ని ఈ ప్రశ్నలు అడుగుంటే బాగుందని చెప్పుకొచ్చింది.

 

ఇక సినిమాల పరంగా చూస్తే సమంత.. తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా ప్రాజెక్టులు.. సైన్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో, ఆదిత్య రాయ్ కపూర్ తో వెబ్ సిరీస్ లు చేస్తున్న సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో కూడా ఒక వెబ్ సిరీస్ సైన్ చేసింది. 

తాజాగా తమిళ్ లో కూడా తలపతి విజయ్.. హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న తలపతి69 సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా కనిపించనుంది. మరోవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై.. ఒక సినిమా సైన్ చేసిన సమంత తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం.. అనే సినిమాలో కూడా నటిస్తుంది.

Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News