Fennel Seed Water: ప్రస్తుతం చాలా మంది ఉదయాన్నే లేవగానే రోజును టీతో ప్రారంభిస్తారు. నిజానికి టీకి బదులుగా గోరువెచ్చని సోంపు గింజల నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇది రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా పని చేస్తుంది. ఈ సొంపు నీరు తాగడం వల్ల సులభంగా శరీర బరుపును కూడా నియంత్రించుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
సోంపు నీటిలో యాంటీస్పాస్మోడిక్, యాంటి-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి, కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
సోంపు నీరు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో మెటబాలిజాన్ని పెంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిచేందుకు కూడా సహాయపడుతుంది. దీనికి కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
సోంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రక్తపోటును తగ్గిస్తుంది:
సోంపు నీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది రక్తనాళాలను విడదీయడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
సోంపు నీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మొటిమలు, చర్మం మంట, ముడతలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Fennel Seed Water: రూ.1 సొంపు వాటర్ తాగితే శరీరానికి ఇన్ని లాభాలా?