RBI Orders: దేసవ్యాప్తంగా మ్యూల్ ఎక్కౌంట్లపై ఆర్బీఐ కొరడా ఝులిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు దేశంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఎండీలు, సీఈవోలతో నిన్న జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఎక్కౌంట్ల పెరిగిపోతున్నాయి. ఇవి బ్యాంకు ఎక్కౌంట్ లేదా డీమ్యాట్ ఎక్కౌంట్ రూపంలో ఉంటాయి. మ్యూల్ ఎక్కౌంట్ అంటే ఒకరి పేరుతో ఎక్కౌంట్ ఓపెన్ చేసి మరొకరు నిర్వహిస్తుంటారు. సాధారణంగా ఈ తరహా ఎక్కౌంట్లను మనీ లాండరింగ్ లేదా ట్యాక్స్ ఎగవేతకు ఉపయోగిస్తుంటారు. మ్యూల్ ఎక్కౌంట్ అనేది బ్యాంక్ ఎక్కౌంట్ లేదా డీ మ్యాట్ ఎక్కౌంట్ రూపంలో ఉంటుంది. ఎక్కువగా మ్యూల్ ఎక్కౌంట్లు డీ మ్యాట్ ఖాతాల కోసం ఉంటుంటాయి. ఇలాంటి మ్యూల్ ఎక్కౌంట్లనే అరికట్టాల్సిందిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆదేశించారు. డిజిటల్ మోసాలు నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్తను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.
క్రెడిట్ అండ్ డిపాజిట్ గ్రోత్, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, ఏఎల్ఎం రిలేటెడ్ సమస్యలు, సెక్యురీటీ లేని రిటైల్ లెండింగ్, సైబర్ సెక్యూరిటీ, ధర్డ్ పార్టీ రిస్క్ వంటి అంశాలపై ఆర్బీఐ గవర్నర్ వివిధ బ్యాంకుల సీఈవోలు, ఎండీలతో చర్చించారు.
మ్యూల్ ఎక్కౌంట్ అంటే ఏమిటి
మ్యూల్ ఎక్కౌంట్ అంటే ఒకరి పేరుతో ఓపెన్ చేసి మరొకరరు నిర్వహిస్తుంటారు. ఇలాంటిటివాటిని సాధారణంగా మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎగవేతకు ఉపయోగిస్తారు. ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్లే నిర్వహించాలని కఠినమైన నిబంధనలున్నాయి. కేవైసీ పూర్తి చేసిన కస్టమర్లకే ఎక్కౌంట్ నిర్వహించే వీలుంటుంది.
మ్యూల్ ఎక్కౌంట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నిర్దేశించిన పలు నిబంధనల్ని అతిక్రమిస్తుంటాయి. ట్యాక్స్ చట్టాల ప్రకారం ఇవి అక్రమం. సెబీ కూడా వీటిప కఠినంగా వ్యవహరిస్తుంటుంది.
Also read: Post office RD Benefits: నెలకు 7 వేలతో మెచ్యూరిటీ తరువాత 5 లక్షలు లాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook