Chadalavada Nagarani: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఐఏఎస్ బదిలీల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బదిలీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆమె వార్తల్లో నిలిచారు. అందరూ ఐఏఎస్ అధికారుల్లా కాదు ఆమెకు ఎంతో ప్రత్యేకత ఉంది. కలెక్టర్‌గా వెళ్లిన నాగరాణి చరిత్ర తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆమె ఎవరో కాదు పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారిగా నేరస్తులు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లను హడలెత్తించిన చదలవాడ ఉమేశ్ చంద్ర సతీమణి.
Also Read: Soldiers: సలామ్ సైనికా.. లఢఖ్ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు దుర్మరణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేరస్తులు, ఫ్యాక్షనిస్టు లు, మావోయిస్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి పశ్చిమ గోదావరి కలెక్టర్ గా నియమి తులయ్యారు. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద నలుగురు నక్సలైట్లు 4 సెప్టెంబరు 1999లో ఉమేశ్ చంద్రను కాల్చి చంపారు. ఇప్పటి తరానికి అతడి గురించి తెలియదు కానీ ఆ కాలంలో ఉమేశ్ చంద్ర అంటే అందరలో హడల్. నాటి యువతకు రోల్ మోడల్.
Also Read: NTR Bharosa Scheme: జగన్, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?
నక్సలైట్లు ఉమేశ్ చంద్రను పొట్టన పెట్టుకున్నప్పుడు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉమేశ్ చంద్ర సేవలకు గౌరవంగా నాగరాణికి అప్పుడు చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అది కూడా చంద్రబాబు హయాంలోనే ఆమె కలెక్టర్‌గా రావడం విశేషం. ఆమె గతంలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ నాగరాణి వెళ్తున్నారు. కాగా నాగరాణి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు కలెక్టర్‌గా పొరుగు జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్లడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter