శంషాబాద్: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే, ఆయన ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారా అని దేశం అంతా వణికిపోతోంది అని ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. మోదీ ఒక ఉగ్రవాదిలా కనిపిస్తున్నారని, దేశ ప్రజలను ప్రేమించాల్సిందిపోయి ఆయన వారిని భయపెట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఒక ప్రధాని హోదాలో వున్న వాళ్లు అలా వ్యవహరించకూడదని విజయశాంతి వ్యాఖ్యానించారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో శనివారం రాత్రి శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
Vijaya Shanti, Congress in Shamshabad, Telangana: Everyone is scared that at what moment Modi will shoot the bomb. He looks like a terrorist. Instead of loving people, he is scaring people. It's not the way how a PM should be. pic.twitter.com/1pDEvYHXH8
— ANI (@ANI) March 9, 2019
ఈ వేదికపై నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ సైతం ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాని అంటే కేసీఆర్‌కి ఎంతో భయం అని, కేసీఆర్ అవినీకి చిట్టా అంతా మోదీకి తెలుసని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోదీ చేతుల్లోనే కేసీఆర్ రిమోట్ ఉందని కేసీఆర్‌ను రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.