Bjp veteran lk Advani admitted at delhi aiims hospital: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఎల్ కే అద్వానీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి ఆయన సన్నిహితులు తరలించినట్లు తెలుస్తోంది. 96 ఏళ్ల అద్వానీకి వైద్యులు అనేక టెస్ట్ లు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన..ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రకటించారు. ఆయనను ప్రత్యేకంగా వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సమాచారం. మరో వైపు బీజేపీ సీనియర్ నేత ఆస్పత్రిలో చేరారనే విషయం తెలిసి పలువురు బీజేపీ అగ్రనేతలు తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు. ఆయన సన్నిహితులకు ఫోన్ లు చేసి, అద్వానీజీ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. 96 ఏళ్ల నాయకుడిని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మూడు నెలల క్రితం అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం.. భారతరత్న ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అద్వానీ నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు భారతరత్నను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఎల్కే అద్వానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బీజేపీ సీనియర్ నేత.. అద్వానీ.. 2002-2004 మధ్య ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎల్‌కె అద్వానీ జూన్ 2002 నుంచి మే 2004 వరకు భారతదేశానికి ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. అదే విధంగా.. అక్టోబర్ 1999 నుండి మే 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా అనేక సార్లు -- 1986 నుండి 1990 వరకు, 1993 నుంచి 1998, 2004 నుండి 2005 వరకు ఉన్నారు.
Read more: Serial bride: నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్.. లబో దిబో మంటున్న యువకులు.. ఎక్కడో తెలుసా..?
ప్రస్తుతం దేశంలో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు అద్వానీ ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళనకు గురౌతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అద్వానీజీ కోలుకోవాలంటూ బీజేపీ నేతలు, అభిమానులు ఆలయాల్లో పూజలు సైతం చేయిస్తున్నట్టు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి