Chandrababu: మళ్లీ జన్మ ఉంటే కుప్పం బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటా: చంద్రబాబు భావోద్వేగం

Chandrababu Emotional In Kuppam Tour: తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు నాయుడు కోట్ల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గ కుప్పంలో పర్యటించి సందడి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 25, 2024, 06:37 PM IST
Chandrababu: మళ్లీ జన్మ ఉంటే కుప్పం బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటా: చంద్రబాబు భావోద్వేగం

Chandrababu Emotional: నాలుగు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. మున్సిపాలిటీ, మండలాలు, పంచాయతీలకు కోట్లాభిషేకం చేశారు. భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేస్తానని హామీల వర్షం కురిపించారు. దాదాపు రూ.500 కోట్ల మేర హామీలు ఇచ్చి కుప్పం ప్రజలపై తన ప్రేమను చూపించారు. సీఎం అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో మంగళవారం చంద్రబాబు పర్యటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన చంద్రబాబు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

'కుప్పం ప్రజల అభిమానం మరువలేనిది. కుప్పం ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం నుంచి ఎనిమిదిసార్లు నన్ను గెలిపించారు.. మళ్లీ జన్మ ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుట్టి మీ రుణం తీర్చుకుంటా' అని చెప్పి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కుప్పంలో కొందరికి వార్నింగ్‌ ఇచ్చారు. 'ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా కుప్పంలో ఎవడన్నా రౌడీయిజం‌, అక్రమ వ్యాపారాలు చేస్తే అదే చివరి రోజు అవుతుంది. ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టించాలని చూస్తే తాటతీస్తా' అని హెచ్చరించారు. అభివృద్ధిని పరిగెత్తిస్తా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ప్రకటించారు.

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

 

'వైసిపీ పాలనలో మున్సిపాలిటీ పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేయలేదు. రూ.100 కోట్ల నిధులతో కుప్పం పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా. ప్రతి మండలానికి‌ రూ.10 కోట్లు, మేజర్ పంచాయతీలకు రూ.2 కోట్లు, మైనర్ పంచాయతీలకు రూ.కోటి నిధులు మంజూరు చేస్తా. పరిశుభ్ర పట్టణంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతా. ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు అందిస్తా. ఎన్టీఆర్ సుజల ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు ఇస్తా' అని చెప్పారు.

'ఎన్టీఆర్ ప్రారంభించిన 730 కిలోమీటర్ల అతిపెద్ద కాలువను ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 30 కిమీలు కూడా పూర్తిచేయలేకపోయింది. వైసీపీకి కాంట్రాక్టర్‌లపై ఉన్న ప్రేమ రైతుల‌పై లేదు' అని చంద్రబాబు విమర్శించారు. పాలారులో చెక్‌డ్యామ్‌లు నిర్మించి సాగునీరు అందిస్తానని, యామగానిపల్లె, మాదనపల్లెల వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టమోటా రైతుల కోసం టమోటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక పూల రైతుల కోసం కుప్పంలో ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

ఎయిర్ పోర్ట్ తెస్తా
'భవిష్యత్తులో విమానాశ్రయం తీసుకొచ్చి కుప్పం రైతులు పండించే కూరగాయాలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తా' అని చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన మాటను మరోసారి ప్రస్తావించారు. 'పేదరికం నిర్మూలన చేసి అందరూ సంపాదించే పరిస్థితి తీసుకొస్తా. పేదరిక నిర్మూలన స్వరాజ్యం చూడాలన్నదే నా జీవిత లక్ష్యం. కుప్పం దేశానికే ఒక ఆదర్శమయ్యేలా అభివృద్ధి చేస్తా' అని చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News