Nita eats Chaat at a local shop after visiting kashi temple: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఉత్తర ప్రదేశ్ లోని కాశీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో.. తన కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ ఆహ్వన పత్రికను ఆలయంలో అందజేశారు. విశ్వనాథుడికి ప్రత్యేకంగా పూజలు జరిపించారు. తమకు మంచి జరగాలని ప్రత్యేకంగా మొక్కులు మొక్కుకున్నారు. అదే విధంగా ఆలయ పూజారులు కూడా నీతా అంబానీకీ ప్రత్యేకంగా ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs
— ANI (@ANI) June 24, 2024
ఈ నేపథ్యంలో.. స్వామివారి దర్శనం అనంతరం నీతా అంబానీ స్థానికంగా సందడి చేశారు. దేశంలోనే అత్యంత ధనిక జాబితాలో ఉన్న కూడా.. సామాన్యుల మాదిరిగా కాశీలో నీతా స్థానికులతో ముచ్చటించారు. ఏమాత్రం దాబు, దర్పం లేకుండా.. ఓక చాట్ దుకాణానికి వెళ్లారు. నీతా ను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఒక చాట్ దుకాణం దగ్గర ఆగి అక్కడ తనకు నచ్చిన చాట్ ను ఆర్డర్ చేశారు. దుకాణదారులతో, చుట్టుపక్కలవారితో.. ముచ్చటిస్తూ చాట్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాట్ ఎంజాయ్ చేస్తు.. నీతా.. "యే పాలక్ చాట్ హై" అని దుకాణదారులతో ముచ్చటించారు. గులాబీ రంగు బనారసీ చీరలో నీతా అంబానీ ట్రెడిషనల్ గా ఆలయంను దర్శించుకున్నారు. ఈ క్రమంలో నీతా వేసుకున్న..వజ్రాల నెక్లెస్ మాత్రం హట్ టాపిక్ గా మారింది.
Read more: Prabhas Vs Chiranjeevi: అప్పట్లోనే చిరంజీవి సినిమాలో ‘కల్కి’ పాట.. ఏ మూవీలో తెలుసా..!
అక్కడున్న వారంతా నీతాను చూసుకుంటూ నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. అంత సంపద ఉన్న కూడా సింపుల్‌గా అందరితో మాట్లాడటం చూసి స్థానికులు సంబర పడ్డారంట. కొడుకు పెళ్లి సందడిలో కూడా.. అక్కడున్న వారితో మాట్లాడటం, ఫోటోలు దిగటం పట్ల లోకల్ జనాలు ఆనంద పడ్డారంట. ఇదిలా ఉండగా.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లివేడుక జులై 12న బీకేసీలోని జియో వరల్డ్ సెంటర్లో జరుగనుంది. ఇప్పటికే అంతన్ అంబానీ, రాధికల ప్రీవెడ్డింగ్ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి