Ivy Gourd Health Benefits: దొండకాయ ఇది ఏడాది మొత్తం మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే కూరగాయ. అయితే, ఈ దొండకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నివారిస్తాయి. దీంతో ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదు దొండకాయ పోషకాలకు పవర్ హౌజ్ ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
సాధారణంగా మన శరీరంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అతిగా ఆయిలీ ఫుడ్, స్పైసీ ఆహారాలు తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో కాళ్ల వాపులు, నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం కూడా ఉంటాయి.
అయితే, దొండకాయ యూరిక్ యాసిడ్ సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. అంతేకాదు కిడ్నీల్లో క్యాల్షియం వల్ల పేరుకున్న రాళ్లను సైతం శరీరం నుంచి బయటకు పంపించడంలో దొండకాయ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
దొండకాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ వారికి కూడా ఎఫెక్టీవ్ రెమిడీ. అంతేకాదు ఇందులో ఉండే క్యాల్షియం, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను సైతం నిర్వహిస్తాయి.
యూరిక్ యాసిడ్ స్థాయిలను మన శరీరంలో తగ్గించుకోవాలంటే దొండకాయను కట్ చేసి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని బాగా వడకట్టుకుని ఖాళీ కడుపున తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )