ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న కుంభమేళా నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారి పాదాలు కడిగి వారిపై తనకు వున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆదివారం ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో పాల్గొన్న మోదీ... గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజలు చేసి, ప్రత్యేక హారతి ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సైతం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడిగిన ప్రధాని మోదీ.. వారికి శాలువలు కప్పి సత్కరించడం విశేషం.
#WATCH: Prime Minister Narendra Modi washes feet of sanitation workers in Prayagraj pic.twitter.com/otTUJpqynU
— ANI UP (@ANINewsUP) February 24, 2019
కుంభమేళా విజయవంతమవడానికి వారు చేసిన కృషిని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు.