Lord Vishnu Favorite Zodiac: హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని ఏకాదశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే నిర్జల ఏకాదశికి మరెంతో ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జైష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు హిందువులంతా శ్రీమహా విష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ రోజు 4 రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ మహా విష్ణువుకు ఇష్టమైన రాశులవారు ఎవరో, వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, విష్ణువుకు ఎంతో ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. అందుకే ఈ రాశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన ప్రతి దానిలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు కూడా సులభంగా పరిష్కారవముతాయి. అంతేకాకుండా విష్ణువు అనుగ్రహంతో భాగస్వామ్య జీవితం ఎంతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి అంటే కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. ఈ రాశివారికి ఎల్లప్పుడు ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా ప్రతి పనిలో విజయం సాధించే గొప్ప శక్తిని పొందుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా మెరుగుపడతారు. వీరు క్రమం తప్పకుండా విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేయాల్సి ఉంటుంది.
సింహరాశి:
శ్రీమహా విష్ణువుకు సింహ రాశి వారంటే కూడా చాలా ఇష్టం. ఈ రాశివారు కూడా అనేక లాభాలు పొందుతారు. అలాగే ఆయన అనుగ్రహంతో ఎప్పుడు పొందలేని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన కష్టానికి తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆయన అనుగ్రహం లభించి అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తులారాశి:
తులా రాశివారికి కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. ఈ రాశివారు కూడా విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వీరికి ఆగిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు వీరి కష్టాలన్నీ ఎంతో సులభంగా తొలగిపోతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి