Telangana IPS Transfers: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలో 28 ఐపీఎస్ లను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటీవల తెలంగాణలో 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్,
సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్,
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
జోగులాంబ గద్వాల ఎస్పీగా టీ శ్రీనివాస్‌రావు
అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్
కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు,
బాలానగర్ డీసీపీగా కే సురేశ్‌కుమార్,
మహబూబ్‌నగర్ ఎస్పీగా ధరావత్ జానకి,
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్,
సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి,
శంషాబాద్ డీసీపీగా బీ రాజేశ్,
మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డిని
వికారాబాద్ ఎస్పీగా కే నారాయణరెడ్డి
నల్గొండ ఎస్పీగా శరద్ చంద్రపవార్
రైల్వేస్ ఎస్పీగా చందనాదీప్తి,
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య,
హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్
జనగామ వెస్ట్‌జోన్ డీసీపీగా జీ రాజమహేంద్ర నాయక్
ఎల్ సుబ్బారాయుడిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
Read more: Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter