Nirjala Ekadashi 2024: నిర్జల ఏకాదశిరోజు ఈ ఒక్కదానం చేస్తే వేయిజన్మల పుణ్యం.. ఆర్థిక శ్రేయస్సు..

Nirjala Ekadashi 2024 Donate: ప్రతి మాసం రెండు ఏకాదశులు వస్తాయి. అలా ఏడాదికి 24 ఏకాదశి పూజ చేస్తారు. అయితే, ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ మాసం జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణు పూజ ఆచరిస్తారు. సాధారణంగా ఏకాదశి అంటేనే అన్నం ముట్టారు. ఈ ఏకాదశికి నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. అందుకే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు.
 

1 /5

ఏకాదశి రోజు ఉదయం లేచి స్నానం చేసి ఇంట్లో పూజలు చేసి, విష్ణు ఆలయాలకు కూడా వెళ్లి పూజించడంతోపాటు  ఉపవాసం కూడా ఉంటారు. అయితే, ఈ నిర్జల ఏకాదశి రోజు ఏ దానం చేస్తే ఆర్థిక శ్రేయస్సు, పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం.

2 /5

నిర్జల ఏకాదశిరోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు. ఈరోజు ముఖ్యంగా దానానికి ప్రాముఖ్యత కలిగి ఉంది. పేదలకు ఈరోజు తెల్లని వస్త్రాలు దానం చేస్తే మంచిది.  

3 /5

ముఖ్యంగా ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్‌ 18న రానుంది. ఈరోజు విష్ణు భగవాణుని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇలా పేదలకు కూడా దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం మీపై ఎల్లవేళాల ఉంటుంది.  

4 /5

నిర్జల ఏకాదశిరోజు నిరుపేదలకు పుచ్చకాయ దానం కూడా ఇవ్వచ్చు. అంతేకాదు ఈరోజు తెల్లనిపాలను కూడా దానం ఇస్తారు. ఇది మీ ఇంటికి సుఖఃసంతోషాలను తీసుకువస్తుంది.  

5 /5

ముఖ్యంగా సీజన్‌ కాబట్టి మార్కెట్లో మామిడికాయలు ఎక్కువగా విక్రయిస్తున్నారు. పేదలకు నిర్జల ఏకాదశిరోజు మామిడిపండు దానం చేస్తే కూడా మీ పాపాలు తొలగిపోతాయి. ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)