Amaravati Farmers Gandhigiri: ప్రతిపక్ష నాయకుడిగా రాజధానిగా అమరావతిని అంగీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని నిర్వీర్యం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల పేరిట విశాఖపట్టణానికి రాజధానిని తీసుకెళ్తానని జగన్ మూర్ఖంగా ముందుకు వెళ్లారు. అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన జగన్ దాని పర్యవసానం తాజా ఎన్నికల్లో పొందారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే.
Also Read: Chandrababu Promises: గెలిచారు సరే.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకుంటారా?
అయితే రాజధాని అమరావతి కొనసాగాలని దాదాపు రెండేళ్లకు పైగా అమరావతి రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం చేశారు. ఎట్టకేలకు తాజా ఎన్నికల్లో జగన్ ఓటమిపాలై చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. అమరావతిని రాజధానిగా చేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంత రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ పీడ విరగడవ్వడంతో ఇక తమ రాజధాని దక్కుతుందని అమరావతి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేత
ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిన జగన్‌కు బుద్ధి చెప్పాలని అమరావతి రైతులు గాంధీగిరి ప్రదర్శించారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి శుక్రవారం చేరుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు తమ గోడు వినలేదని.. ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్‌కి ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. జగన్ వల్లే ఉద్యమాలు చేయడం నేర్చుకున్నామని, ఇంట్లో ఉండి గరిటెలు తిప్పే తమకు జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేన్న మహిళా రైతులు పేర్కొనడం విశేషం.
తమకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి మిఠాయిలు, మామిడి, అరటి పండ్లు, తాంబూలం ఇచ్చేందుకు రాగా అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదన్న సెక్యూరిటీ నిరాకరించారు. దీంతో కొద్దిసేపు భద్రతా సిబ్బందితో రాజధాని రైతుల వాగ్వాదం చేశారు. అర గంటపాటు జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసిన రైతులు ఎంతకీ స్పందన రాకపోవడంతో వెనుదిరిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter