Ap assembly election results 2024: ఏపీలో దూసుకుపోతున్న కూటమి.. చంద్రబాబు నివాసంలో భారీగా సంబరాలు..

Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్  ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 4, 2024, 11:21 AM IST
  • వైఎస్ జగన్ కు ఊహించని షాక్..
  • చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న కార్యకర్తలు..
 Ap assembly election results 2024: ఏపీలో దూసుకుపోతున్న  కూటమి.. చంద్రబాబు నివాసంలో భారీగా సంబరాలు..

Loksabha elections results update 2024: ఏపీలో కూటమి పార్టీ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ప్రదేశ్‌ లో కౌంటింలో కూటమి దాదాపు 155 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ కి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కూటమి 125 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. వైసీపీ మాత్రం వెనుకంజలో కొనసాగుతుంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ పార్టీ గల్లంతవుతుందని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. కానీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాత్రం ప్రజలకుచేసిన మంచిని చూసి, తమకు పట్టం కడతారని భావించారు.

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

పలు ఎగ్జీట్ సర్వేల అంచనాలకు పూర్తిగా భిన్నంగా.. ప్రజలు ఇప్పుడు ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ మంత్రులు తొలిరౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ కీలక నేతలు.. అంబటి రాంబాబు, రోజా, తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కాకాని, బోత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, అనిల్ కుమార్, వల్లభ నేని వంశీ, కొడాలి నాని తదితరులు ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. ఇక ఏపీ ప్రజలు కూటమికి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

చంద్రబాబు నివాసంలో సంబరాలు..

చంద్రబాబు నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ తో ఉన్నారు. కూటమి నేతలు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ నేతలు ఫుల్ జోష్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి రావడంపట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే అధికారులు ప్రత్యేకంగా భద్రత్రను అందజేశారు. ఇక మరోవైపు కూటమి పార్టీలు ఎన్నికలలో కలిసి బరిలో నిలవడం, వైఎస్సార్సీపీకి పెద్ద దెబ్బగా చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News