Music Shop Murthy Trailer: అదిరిపోయిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ట్రైలర్.. అజయ్ ఘోష్‌ ఎమోషనల్ డైలాగ్స్‌

Music Shop Murthy Trailer Talk: మ్యూజిక్ షాప్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 50 ఏళ్ల వయసులో డీజే అయ్యేందుకు అజయ్ ఘోష్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఎమోషనల్‌ డైలాగ్స్‌లో ట్రైలర్ సాగింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2024, 06:28 PM IST
Music Shop Murthy Trailer: అదిరిపోయిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ట్రైలర్.. అజయ్ ఘోష్‌ ఎమోషనల్ డైలాగ్స్‌

Music Shop Murthy Trailer Talk: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వం వహించగా.. ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌తో మంచి క్రియేట్ అయింది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. జూన్ 14న థియేటర్లలో 'మ్యూజిక్ షాప్ మూర్తి' సందడి మొదలు పెట్టనుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాగా రాబోతోందన్నారు. 

Also Read: Motorola Edge 50 Fusion Price: రూ.20,999కే 50MP OIS కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్ వచ్చేసింది! ఫీచర్స్‌ వివరాలు..  

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నవ్విస్తునే.. ఏడిపించేలా కట్ చేశారు. మధ్యతరగతి కుటుంబ కష్టాలను చూపిస్తునే.. కల కనడానికి, ఆ కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేలా స్టోరీ సాగుతున్నట్లు అనిపిస్తోంది. 'అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి' అంటూ ట్రైలర్‌లో అజయ్ ఘోష్ చెప్పిన డైలాగ్ ఎమోషనల్‌గా ఉంది. 'అందరికీ సుబ్బలక్ష్మి సుభ్రభాతం పాడితే.. నాకు మాత్రం నువ్వు పాడతావు..' అనే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.

"మూర్తి మనం లైఫ్‌లో ఇష్టపడి ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. దాన్ని మనం వదిలిపెట్టకూడదు.." అంటూ చాందినీ చౌదరి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. డీజే అవుతామని హైదరాబాద్‌కు వచ్చిన అజయ్ ఘోష్‌.. అక్కడ కష్టాలు, అవమానాలు ట్రైలర్‌లో చూపించారు. అజయ్ ఘోష్ జైలుకు ఎందుకు వెళ్లారు..? చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా..? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. బేబీ, డీజే టిల్లు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి సూపర్ హిట్ సినిమాలను డిస్టిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా వ్యవహరించగా.. పవన్ మ్యూజిక్ అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 
 
టెక్నీకల్ టీమ్:

==> రైటింగ్ & డైరెక్షన్: శివ పాలడుగు 
==> ప్రొడ్యూసర్స్: హర్ష గారపాటి, రంగారావు గారపాటి 
==> సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు
==> బ్యానర్: ఫ్లై హై సినిమాస్
==> మ్యూజిక్: పవన్ 
==> సాహిత్యం: మహేష్ పోలోజు & పవన్
==> కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగం 
==> ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
==> కొరియోగ్రఫీ: మొయిన్ మాస్టర్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్‌ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News