తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా చెంచుపల్లి మండలం బదావంత్ తండా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధి ఓటు గల్లంతు అయింది . ఓటు వేయడానికి వస్తే లిస్ట్ లో తన పేరు లేదని అధికారులు చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించిన ఆమె..ఈసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించింది. తన ఓటును కావాలనే తొలగించారని..ఇందులో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతల హస్తం ఉందని ఆమె ఈ సందర్భంగా ఆరోపించింది