Goods Train Derails: గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కొద్దిలో రెండు ఘోర ప్రమాదాలు తప్పాయి. అధికారుల చాకచక్యంతో రెండు రైళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించే శబరి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వెంటనే ఆపివేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ఆదివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలు పక్కకు కొంత ఒరిగాయి. అయితే వెంటనే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆ మార్గంలో వచ్చే రైళ్లకు ముందస్తు సమాచారం ఇచ్చి నిలిపివేశారు. ఈ ప్రమాదం కారణంగా మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్ల అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: AP Postal Ballot Votes: రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. రాజకీయ పార్టీల్లో కలవరం
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గం గూండా ప్రయాణిస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్ కొద్దిసేపు ఆగిపోయింది. ఇక అదే మార్గంలో వెళ్లాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా రైల్వే అధికారులు నిలిపివేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కొద్దిసేపు ఆగింది. అయితే అకస్మాత్తుగా రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా పట్టాలు తప్పిన విష్ణుపురంలో అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గూడ్స్ రైలును పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదం