Cashew Nuts Benefits In Telugu: డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు ఇవి ప్రభావవంతంగా సహాయపడతాయి. దీంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని ఆరోగ్య నిపుణులు సూపర్ ఫుడ్స్ గా భావిస్తారు. ప్రస్తుతం చాలామంది అల్పాహారంలో భాగంగా అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటున్నారు. బాదం పిస్తాతో పాటు కాజూను కూడా ఎక్కువగా తింటున్నారు. ప్రతిరోజు జీడిపప్పును ఉదయం పూట తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి కావలసిన ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి..
జీడిపప్పులో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు జీడిపప్పును ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల మరెన్నో లాభాలు పొందుతారు.
ఎముకల ఆరోగ్యానికి..
జీడిపప్పులు తగినన్ని ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో కాల్షియం, మెగ్నీషియంతో పాటు ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటుంది. ఎముకల అరుగుదల, బోలు ఎముకల వ్యాధులు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు కూడా దోహదపడుతుంది.
రోగ నిరోధక శక్తి కోసం..
జీడిపప్పులో అనేక రకాల పోషకాలు, జింక్ లభిస్తుంది. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రోగ నిరోధక శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్న వారు ప్రతిరోజు ఉదయం పూట తప్పకుండా జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు గాయాన్ని త్వరగా నయం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. దీంతోపాటు కణాల ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కంటి చూపు..
చాలామందిలో పోషకాని లోపం కారణంగా కంటిచూపు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి, కంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలు రాకుండా ఎంతగానో సహాయపడతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
శరీర బరువు కోసం..
చాలామంది బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్లు అనుసరిస్తున్నారు. అయితే ఇకనుంచి తప్పకుండా డైట్‌లో జీడిపప్పును తీసుకోవాలి. ఇందులో ఉండే పోషక గుణాలు శరీరాన్ని రక్షిస్తూ బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి