More than 100 killed by landslide in Papua New Guinea: నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశానికి ఉత్తరాన ఉన్న ఎంగాలోని విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాపువా న్యూ గినియాలోని ఆరు మారుమూల గ్రామాలు ఈ ఘటనలో చనిపోయినట్లు తెలుస్తోంది. కావోకలమ్ ప్రాంతంలో అకాస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి కొండల కింద ఉన్న వారిపై పడినట్లు తెలుస్తొంది. ఈఘటనలో వందల ఇళ్లు నెలమట్టమయినట్లు తెలుస్తోంది. అదే విధంగా వందల మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. శిథిలాల కింద ఉన్న వారి జాడను కనుక్కునేందుకు అధికారులు సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య ఎంతమంది చిక్కుకుపోయారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, ఇప్పుడైతే.. రెస్క్యూ కొనసాగుతుందని సమాచారం.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
ఈఘటనపై పపువా న్యూగీనియా ఎంగా గవర్నర్ పీటర్ స్పందించారు. ఈఘటనను అతిపెద్ద విపత్తుగా అభివర్ణించారు. పపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపే మాట్లాడుతూ, తమ ప్రభుత్వం కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో సహాయక చర్యలు ప్రారంభించిందని, మృతదేహాల వెలికితీత, పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం విపత్తు అధికారులను పంపిందని చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరాపే భరోసా ఇచ్చారు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
ప్రమాదం జరిగిన ప్రదేశానికి విపత్తు నిర్వాహణ దళాలు, రెడ్ క్రాస్ అధికారులు, డిజాస్టర్ టీమ్ లను పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో దాదాపు వంద మందికి పైగా చనిపోయి ఉంటారని సమాచారం. అక్కడి ఇళ్లన్ని పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రజలంతా సహాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏ శిథిలాల కిందచూసిన శవాలు కన్పిస్తున్నాయి. తమ వారి కోసం అక్కడి వారంతా వెతుకుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎంత మంది చనిపోయారో చెప్పలేమని అధికారులు చెబుతున్న.. ఈ ఘటనలో మాత్రం వందల మంది అమాయకులు తమ ప్రాణాలు కొల్పొయి ఉంటారని సమాచారం. ఈఘటనపై పలు దేశాలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter