Jr NTR - Devara: ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా దక్షిణాదిన ఎంట్రీ ఇస్తున్నాడు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఫియర్ సాంగ్’ అంటూ విడుదలైన ఈ సాంగ్‌ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి రాశారు. పాటలో లైన్స్ ఎన్టీఆర్ పోషించిన పవర్ఫుల్ పాత్రలోని గర్జనను తెలియజేస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. అంతేకాదు ఈ పాటను ఆలపించడం విశేషం.దేవర-లార్డ్ ఆఫ్ ఫియర్‌గా పాట నెక్ట్స్ లెవల్లో ఉంది. పాట విడుదలైందో లేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే పాటలోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మంచి కిక్‌ను ఇస్తున్నాయి.
All Hail……All Hail…🔥🔥
The waves have come in full force to celebrate the Lord of Fear in all his glory ❤️🔥❤️🔥#FearSong out now!
-- https://t.co/Y5l1jBi6cIAn @anirudhofficial Musical 🎶#Devara #DevaraFirstSingle
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan… pic.twitter.com/85cmi9LGYK— NTR Arts (@NTRArtsOfficial) May 19, 2024
తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో భాషల్లోనూ ఈ పాటను ఒకేసారి విడుదల చేశారు. అన్నీ లాంగ్వేజెస్‌లో ఈ పాట వినసొంపుగా ఉంది. అనిరుద్ రవిచందర్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాటను పాడారు. కన్నడ, మలయాళ భాషల్లో సంతోష్ వెంకీ ఈ సాంగ్ పాడటం విశేషం. తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన దేవర ఫియర్ సాంగ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌లా అందరినీ అలరిస్తోంది. పాటలోని నిర్మాణ విలువలు, గ్రిప్పింగ్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.
‘దేవర’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
Also read: Strawberries Health: స్ట్రాబెర్రీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook