నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్!

నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్!

Last Updated : Jan 5, 2019, 07:52 PM IST
నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్!

మెగా బ్రదర్ నాగబాబుకు బాలయ్య బాబు అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. చెన్నైలోని ఓ కళాశాలలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు అక్కడ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా స్టేజీకి ముందు భాగంలో వున్న బాలయ్య బాబు అభిమానులు ఒక్కసారిగా "జై బాలయ్యా.. జై బాలయ్యా" అంటూ బిగ్గరగా నినాదాలు చేయడం ప్రారంభించారు. నాగబాబు ప్రసంగిస్తున్నంతసేపు బాలయ్య బాబు అభిమానులు నినాదాలు చేస్తూనే వున్నారు. దీంతో బాలయ్య అభిమానుల వైఖరిపై నాగబాబు ఒకింత అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. 

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ బాలయ్య బాబు అంటే ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించడమే బాలయ్య బాబు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అప్పటినుంచి ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ బాలయ్య అభిమానులు నాగబాబుపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఏదేమైనా ఈ తాజా పరిణామంతో నాగబాబు-బాలకృష్ణల వివాదం ఇంకాస్త తారాస్థాయికి చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలావుంటే, నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలోని మొదటి భాగం కథా నాయకుడు జనవరి 9న ఆడియెన్స్ ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బృందం.. సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Trending News