Sreemukhi: శ్రీముఖి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ విషయాలు తెలుసా.. శ్రీముఖి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవి సంబంధించిన అదుర్స్ ప్రోగ్రామ్‌తో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పటాస్ సహా పలు టీవీ ప్రోగ్రామ్స్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యాంకర్‌గా నటిగా ఫుల్ బిజీగా ఉంది.
టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి .. 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో నటించింది.
హీరోయిన్గా 2013లో విడుదలైన ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో పరిచయమైంది. తెలుగులో అత్యధిక పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగిపోయింది.
తెలుగులో అదుర్స్, సూపర్ సింగర్ 9, పటాస్ వంటి టీవీ ప్రోగ్రామ్స్ శ్రీముఖికి మంచి పేరు తీసుకొచ్చాయి.
సినిమాల్లో నేను శైలజా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి, భోళా శంకర్ సహా పలు కన్నడ సినిమాల్లో నటించింది.
ఇక క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి నటనకు మంచి మార్కులే పడ్డాయి.అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది. అక్కడ శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.
శ్రీముఖి తెలంగాణలోని నిజామాబాద్‌లో 10 మే 1993లో జన్మించింది. శ్రీముఖి తండ్రి రామ్ కిషన్ ప్రముఖ కంపెనీలో మంచి పొజిషన్లో పనిచేస్తున్నారు. తల్లి లత బ్యూటీషియన్.. తమ్ముడు సుష్రుత్, చెల్లెలు చెర్రీ ఉన్నారు.
త్వరలో శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ఈ యేడాదే పెళ్లి పీఠలు ఎక్కుబోతున్నట్టు సమాచారం.