Dangers Of Skipping Meals With Diabetes In Telugu: మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యం, ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం కారణంగా మధుమేహం తీవ్రతరమవుతోంది. శరీరంలోని షుగర్ పెరగడం కారణంగా అన్ని అవయవాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా చాలా మందిలో నరాలు, మూత్రపిండాలు మొదలైన వ్యాధులకు దారీ తీయోచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్‌తో బాధపడేవారు ఉదయం పూట ఆల్పాహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. అలాగే ప్రత్యేకమైన సమయాల్లో ఆహారాలు తినలేకపోతున్నారు. ఇలా చేయడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం మానేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గొచ్చు:
డయాబెటిక్ పేషెంట్లు భోజనం తినడం మానుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు శరీరంలో కూడా తీవ్ర మార్పులు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిస్ మందులు ప్రతి రోజు వినియోగించేవారు తప్పకుండా ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ఛాన్స్:
సరైన సమయాల్లో సరైన ఆహారాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా డయాబెటిక్ పేషెంట్లలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి పెరిగి శరీర బలహీనత వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే కొంతమంది ఉదయం పూట అతిగా ఆహారాలు కూడా తీసుకుంటున్నారు. దీని కారణంగా కూడా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమంది చక్కెరతో కూడిన స్నాక్స్ కూడా తింటున్నారు. దీని వల్ల కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి:
మధుమేహంతో బాధపడేవారు భోజనం మానుకునే సమయంలో తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరిక్షించుకోవడం చాలా మంచిది. దీంతో పాటు వీరు ఎక్కువ సేపు ఆకలితో ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొంతమందిలో మధుమేహంతో బాధపడుతున్నవారిలో ఆహారాలు తినాలని అనిపించకపోవచ్చు. ఇలాంటి సమయంలో చెమటలు పడుతూ ఉంటాయి. అలాగే శరీరం కూడా బలహీనంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సంద్భాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కొంతమందిలో ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆకలి కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుదలకు సంకేతాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి